ఆధునిక ప్రపంచంలో కూడా వీటికి తిరిగే లేదు
ముంచుకొస్తున్న ఎండలకు విరుగుడు
పెద్దసెట్టిపల్లె చల్లని మట్టికుండలు .!
*కడప జిల్లా మైదుకూరు మండలం పెద్దసెట్టిపల్లె పేరు చెబితే చాలు చల్లని నీటితో దాహం తీర్చే మట్టి కుండలు గుర్తుకు వస్తాయి.
*ఆములో కాల్చి తాజాగా బయటకు తీసిన తాజా కుండలు ఎండలను ఎదుర్కొనేందుకు సిద్దం అయ్యాయి. మైదుకూరు- బద్వేలు రోడ్డులో మైదుకూరికి ఆరు కిలోమీటర్ల దూరంలో పెద్దసెట్టిపల్లె దాదాపు 10 కుటుంబాల వారు కుండలను తయారు చేస్తున్నారు. రోడ్డుపైన కాకుండా ఊరిలోపలి వీధిలోకి వెళ్లి బట్టీలవద్దనే తీసుకుంటే మంచి తాజా కుండలను ,బానలను , తొట్లలను, పాత్రలను తక్కువ ధరలకే ఇస్తారు. ఈ కుండల్లో నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఫ్రిజ్ నీళ్ళు తాగి అనారోగ్యం పాలు కావడం కంటే ఈ కుండల్లో నీళ్ళు తాగితే శ్రేష్టం . ఇంకెందుకు ఆలస్యం చలో పెద్దసెట్టిపల్లె ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి