ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...
ఖాజీపేట మండలంలో గత రాత్రి 9 గంటల సమయంలో అర్చన పల్లె మరియు కుందువు నది ప్రాంతాలలోని కాపర్ వైర్ల మోటర్లు కోసం వెళ్లిన ముగ్గురు దొంగలను పట్టుకొనే నేపథ్యంలో పరారీ.
గత కొద్దిరోజుల నుంచి ఇప్పటికే సుమారు పది మోటర్లను మరియు కాపర్ వైర్లను దొంగిలించినట్లు రైతులు చెప్తున్నారు. అంతేకాకుండా దొంగిలించిన మోటార్ల పైన కేసు నమోదు చేయమంటే పోలీసులు పట్టించుకోవడంలేదని తెలుగుదేశం నాయకులను తీసుకెళ్తే గాని కేసు నమోదు చేసే పరిస్థితి లేదని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనానికి కుంద ఉన్నది ప్రాంతంలో ఉన్న మోటార్లను తీసుకెళ్లి తుండగా గమనించిన ఆటో యజమాని గ్రామస్తులకు తెలియజేయడంతో. వారి వద్దనున్న పల్సర్ బైక్ దొంగలచిన వైర్లతో అక్కడే వదిలి కుందూ నదిలోకి మరో దొంగతనానికి వెళుతుండగా ఒకరు గమనించి మరికొందరి రైతులకు సమాచారం ఇవ్వడంతో దొంగలు అక్కడ నుంచి తప్పించుకొని కుందూ నదిలోనే ఉండి రైతులు వెళ్లిన తర్వాత అక్కడ నుంచి వెళ్లినట్టు చెప్తున్నారు .ఇప్పుడు బైక్ కోసం మైదుకూర చెందిన ఒక నాయకుడితో మంతనాలు చేస్తున్నారని మీడియాకు తెలియజేశారు.
పరారైన దొంగలు అక్కడే వదిలి వెళ్లిన బైక్ తో పాటు దొంగిలించిన కాపర్ వైర్ల మూటకూడా రైతులు స్వాధీనం చేసుకున్నారు . వారు ఇప్పుడు ఒక రైతుకు ఫోన్ చేసి మా బైకు రాత్రి అక్కడ స్టార్ట్ కాకపోవడంతో వదిలిపెట్టి వెళ్ళాము మా బైకు ఇవ్వండి అని దొంగలు చెబుతున్నట్టు రైతులు అంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి