మైదుకూరు నియోజకవర్గంలోమిరప తోట లో కొత్త వైరస్ తో బెంబేలెత్తుతున్న రైతన్నలు !
కడప జిల్లాలోనే అత్యధికంగా మిరప సాగు చేసే రైతులు మైదుకూరు నియోజకవర్గంలో ఉండట విశేషం గత రెండు సంవత్సరాల కిందటి నుంచి మైదుకూరు ప్రాంతంలో నర్సరీలు పెరిగిపోవడంతో మిరప పంట సాగు చేయడం మార్గంలో సులభతరంగా మారింది.
కాజీపేట మరియు మైదుకూరు మండలం నాటిన నెలరోజులకు ఈ వైరస్ సోకి ఎదుగుదల లేకుండా పోయిన మిరప తోటలో పెట్టుబడులు రాక అయోమయ స్థితిలో రైతన్నలు . కాయలు ఉన్న సమయంలో రేటు లేక రేట్లు ఉన్న సమయంలో కాయలు లేక ప్రతి సంవత్సరం ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలకు కరోనా తర్వాత ఈ ఏడాది అన్న లాభదాయకంగా సాగుతోందన్న ఆశ నిరాశే మిగిల్చింది.
మిరప సాగు చేసినప్పటి నుంచి రసాయనిక మందులు వాడకుండా పెరిగే పరిస్థితి కనిపించడం లేదు ఈ పరిస్థితుల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి సాగుచేసిన మిరప పంట నెలరోజులకే వైరస్ రావడంతో వాటిని దున్ని వేయవలసిన పరిస్థితి. ఆ వైరస్ మొక్కల నుంచి వస్తుందా లేక భూమినచి వస్తుందా అనే పరిశోధన చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు .ఇప్పటికైనా అధికారులు మేల్కొని వీటిపైన లోతైన పరిశోధన చేసి రైతులను కాపాడవలసిందిగా కోరుకుంటున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి