ఖాజీపేట కమలాపురం దారిలో వెళుతున్నారా అయితే జాగ్రత్త ?
వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట
కమలాపురం రాష్ట్రీయ రహదారిలో వెళ్లాలంటే ఏమి జరుగుతుందోనని ఆందోళన లో వాహనదారులు. కాజీపేట నుంచి కమలాపురం వెళ్లడానికి నాలుగు ప్రధాన బ్రిడ్జిలు ఉండగా అందులో మూడు లోతట్టు బ్రిడ్జిలు ఉండగా వాటిని వాటిలో రెండు ఆధునీకరణ చేసి హైలెవెల్ బ్రిడ్జి గా మార్చడం జరిగింది అయితే ఇక్కడే వచ్చింది తిరకాసు బ్రిడ్జిలు వేశారు కానీ రోడ్డు మరమ్మతులు మాత్రం మర్చిపోయారు ఏమో?
రాత్రి సమయాలలో స్పీడ్ గా వెళ్ళారంటే మీకు లో దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరడం ఖాయం ఎందుకంటే ఆ రోడ్డును మరమ్మతులు చేయలేదు
ఆ రోడ్డును కొద్దిరోజులు మెయింటినెన్స్ కోసం వదిలిపెట్టడం సహజమే అయితే అలా ఎన్ని రోజులు వదిలిపెడతారు అంటున్న ప్రయాణికులు
కమలాపురం నుంచి కాజీపేట కు వెళ్లే దారి లో గతంలో ఇలాంటి సంఘటన వల్ల డివైడర్ను ఢీకొని ఒకరు మృతి చెందడం కూడా జరిగింది
అయినా కాంట్రాక్టర్లు ఆ పనిని పూర్తి చేయకపోవడంతో భవిష్యత్తులో ఎంత మంది తల్లులకు కడుపుకోత మిగులుస్తరో ఆని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి