ఖాజీపేట మండలంలో కొద్దిరోజుల తర్వాత పెన్నానది కనిపించకపోవచ్చు ?

 పెన్నా నది ఈ పేరు చాలామందికి సుపరిచితం కర్ణాటక జిల్లా కోలార్ లో జన్మించి 560 కిలోమీటర్లు ఈ నది ప్రవహించే చివరకు నెల్లూరు జిల్లాలో ఊటుకూరు ,సంగం దగ్గర బంగాళాఖాతం కలవనుంది. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారేమో ?

ఖాజీపేట మండలం ఆంజనేయపురం సమీపంలో గల నది పరివాహక ప్రాంతాన్ని కొందరు. నదిని  ఆక్రమించి భూములు తయారు చేశారు. అక్కడ పనిచేస్తున్న రెవిన్యూ అధికారులు దానిని తప్పు పట్టకుండా వారి దగ్గర్నుంచి తగినంత పారితోషకం తీసుకొని పట్టీపట్టనట్లు గా పైన ఉన్న భూముల యజమానులు ను కాదని క్రింద నదీ ప్రాంతంలో సాగు చేసిన వారికి మద్దతు తెలపడం ఎంతవరకు సమంజసం అంటున్నా పట్టా భూముల యజమానులు. ఇలాంటి అధికారులు ఉన్నంతవరకు అవినీతి మాత్రం మారదు భావితరాల వారికి ఇక్కడ పెన్నా నది ఉండేది గత రెవెన్యూ అధికారులు మింగేశారు అందుకే కనిపించకుండా పోయిందని పుస్తకాల్లో చదువుకునే ప్రమాదం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు 

ఈ భూములు ఆక్రమించిన ఆవేదన చెందిన కొందరు వ్యక్తులు ఖాజీపేట రెవిన్యూ ఆఫీసర్ కు విన్నవించిన ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రెవెన్యూ ఆఫీసర్ వచ్చి సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్నా ప్రజలకు చేసిన సేవ ఏమీ లేదని అటు అధికార పక్షం గాని విపక్షాన్ని గాని


ముక్కున వేలేసుకుంటున్నారు.

పెన్నా నది లో సుమారు 20 ఎకరాలు  భూములు తయారుచేసిన. వారిని నోటీసు ఇవ్వడం కానీ చేయడం తప్పని కానీ చెప్పిన సందర్భం లేకపోవడంతో . విచ్చలవిడిగా భూముల ఆక్రమించడం జరుగుతుంది. ఈ ఎమ్మార్వో వచ్చినప్పటినుంచి రెండు సంవత్సరాల్లో సుమారు 300 ఎకరాల భూముల అక్రమ జరిగిందని మండలం లో గుసగుసలు వినిపిస్తున్నాయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి