కాజీపేట బ్రిడ్జిపై సాయంత్రం నడవాలంటే నరకయాతన ?
కాజీపేట లో ఉన్న వక్కిలేరు బ్రిడ్జిపై సాయంత్రం సమయంలో నడవాలంటే నరకయాతన తప్పదు .
వివరాల్లోకి వెళితే సాయంత్రం సమయంలో నాలుగు గంటల నుంచి సుమారు ఏడు గంటల వరకు కూరగాయల దుకాణాలతో కిక్కిరిసిన ఈ ప్రాంతం అటు బాటసారులకు కానీ ఇటు వాహనదారులకు కానీ బ్రిడ్జి దాటాలంటే తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి లోనవుతున్నారు.
బ్రిడ్జి లో సగం భాగం కాజీపేట పంచాయతీకి సగం భాగం పుల్లూరు పంచాయతీకి రావడంతో వ్యాపారస్తులు అందరూ కాజీపేట భాగంలో దుకాణాలు పెట్టకుండా . కాజీపేట భాగం లో పెడితే పంచాయతీ క పన్ను చెల్లించాలి కాబట్టి .అందరూ పుల్లూరు పంచాయతీ ప్రాంతంలో పెటడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడం తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది .నిన్న ఒక విద్యార్థికి లో తప్పిన ప్రమాదం . ఇందులో కొసమెరుపేమిటంటే కొందరు రైతులు అని చెప్పుకుని అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు సాయంత్రం సమయంలో జన సంచారం ఎక్కువగా ఉన్నారు కాబట్టి వ్యాపారస్తులు అందరూ ఒకే చోటికి చేరి వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారం నిర్వహించడం వల్ల ఇబ్బంది లేదు కానీ పూర్తిగా రోడ్డును అడ్డంగా వాహనాలు నిలిపి కొనుగోలు చేయడం వల్ల బస్సులకు కూడా తీవ్ర ఇబ్బంది పరిస్థితి ఏర్పడిది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి