ఈయన సీఐగా ఎక్కడున్నాన్న రచ్చే?

మైదుకూరు రూరల్ సీఐ పని చేసిన  కంబగిరి రాముడు గతంలో మైదుకూరు రూరల్ సిఐ గా పనిచేసిన సందర్భంలో కొందర్ని టార్గెట్ చేసి కాజీపేట వైకాపా నాయకుడైన వాసుదేవ రెడ్డి డి గంగాధర్ రెడ్డి ని . కాజీపేట అప్పటి ఎస్ ఐ  రోషన్ కలిసి. టిడిపి నాయకుల మాటలు విని గన్ను పెట్టి బెదిరించిన  సందర్భాలు కూడా కోకొల్లలు. నియోజకవర్గంలో కొందరు డబ్బు ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం

కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పేరుతో. కర్నూల్  తాలూకా అర్బన్ సీఐ. కంబగిరి రాముడు. అవినీతి బాగోతం తో జిల్లా ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి సీఐ పై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చాలని. ఆదేశాలు జారీ చేశారు.


 ఈ నెల 19న కర్నూలు మండలం పంచలింగాల చెక్పోస్ట్ వద్ద. SEB అధికారులు. హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్తున్న bus ను  తనిఖీ చేశారు. తమిళనాడుకు చెందిన సతీష్ బాలకృష్ణ అనే ప్రయాణికుడు వద్ద. రూ 75 లక్షలు గుర్తించారు.  SEb అధికారులు. డబ్బుతో పాటు అతనిని ని కర్నూల్ తాలూకా అర్బన్ పోలీసుల కు అప్పగించారు. పట్టుబడిన నగదు కు సంబంధించిన పత్రాలను అతను పోలీసులకు చెప్పారు. సీఐ కంబగిరి రాముడు మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వకుండా. జిల్లా ఎస్పీకి ఇవ్వాలంటూ. రూ 15లక్షలు బలవంతంగా తీసుకున్నారు. అందులో ఐదు లక్షలు ముగ్గురు మధ్యవర్తులు ఇచ్చారు. రూ 10 లక్షలు తన వద్ద ఉంచుకుని మిగిలిన 60 లక్షలను సతీష్ బాలకృష్ణకు ఇచ్చారు. దీనిపై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు వీరి ద్వారా విషయం తెలుసుకున్న . జిల్లా ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి సీఐ పై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. సతీష్ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మీనారాయణ సీఐ తో పాటు ముగ్గురు మధ్యవర్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ విజయవాడకు వెళ్తున్నట్లు తెలుసుకొని అతను అరెస్టు చేసి తీసుకు వచ్చేందుకు జిల్లా రక్షణాధికారి ప్రత్యేక పోలీసు బృందాలను పంపారు. ఈ విషయం తెలుసుకున్న సిఐ పరారీలో ఉన్నట్లు సమాచారం. ముగ్గురు మధ్యవర్తులను అదుపులోకి తీసుకుని క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...