ఈయన ఎవరు తప్పించలేరు ఈయనకు ఆస్కార్ అవ్వాల్సిందే ?

 ఖాజీపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి: ఖాజీపేట  కేంద్రంలోని మోడల్ స్కూల్ లో విద్యార్థులను అసభ్య పదజాలంతో తిడుతూ, మహిళ ఉపాధ్యాయురాలు పట్ల దురుసుగా మాట్లాడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని  ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు  గండి సునీల్ కుమార్ పేర్కొన్నారు.  స్థానిక మోడల్ స్కూల్ ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ... 

           ఖాజీపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థినీలను నోటిలోకి వచ్చినట్లు అసభ్య పదజాలంతో తిడుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విద్యార్థులు తమదృష్టికి తీసుకువచ్చారని వారు తెలిపారు. అంతే కాకుండా తోటి మహిళ ఉపాధ్యాయురాలతో కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని, హాస్టల్ వార్డెన్ కి రాత్రి సమయాల్లో ఫోన్ కాల్స్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని వారు తెలిపారని అన్నారు. ఈవిషయం ప్రిన్సిపాల్ ని అడుగగా నేను ఏ సమయంలో అయిన కాల్ చేస్తాను అని చెప్పడమే కాకుండా నాకు రాజకీయ, అధికారుల సపోర్టు ఉంది మీరు ఏమి చేస్తారు అని    ప్రిన్సిపాల్ చెప్పడం చాలా దారుణమని వారు అన్నారు. రాజకీయ అండతో రెచ్చిపోయి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ పై జిల్లా అదికరులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు రవి వర్మ, మదన్,

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి