కాజీపేట జాతీయ రహదారి టోల్ ప్లాజా నిర్మాణం గ్రామస్తులు వ్యతిరేకత.
ఖాజీపేట మండలం దుంపలగట్టు సమీపంలో నూతన టోల్ ప్లాజా నిర్మించడం ప్రారంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆక్ట్ 1956 ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా టోల్ ప్లాజా నిర్మాణం చేపట్టడంతో వ్యతిరేకత ఎదురవుతున్న వైనం. ఈ చట్టం ప్రకారం టోల్ ప్లాజా కార్పొరేషన్ పరిధిలో కానీ మరియు పట్టణ పరిధిలో కానీ ఉండకూడదని నియమ నిబంధనలతో ఆక్కడికి నుండి తరలించడానికి సిద్ధమైన టోల్ ప్లాజా .గ్రామాల పరిధిలో కూడా ఉండకూడదు నిబంధనలను పక్కన పెట్టి ఈ ప్రాంతంలో నియమించడంతో భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
అధికారులు చెప్తున్న ప్రకారం టోల్ గేట్ నుంచి మరో మరో టోల్ గేట్ కు 60 కిలోమీటర్లు ఉండాలని అందుకే ఇక్కడ నిర్మించాలి అంటున్నారు కార్పొరేషన్ పరిధి దాటిన తర్వాత 10 కిలోమీటర్లు ఉండడంతో ఇక్కడ నిర్మిస్తున్నారు అంటున్నారు. ఇక్కడ అ టోల్ ప్లాజా మరో టోల్ గేట్ కు దూరం సరిపోతుందని అంటున్నారు. ఒక అధికారిని అడుగగా అలాంటి నిబంధనలు ఏమీ లేవని అలా తక్కువ దూరం ఉంటే తక్కువ రుసుము వసూలు చేయవచ్చని నిబంధనలు కూడా ఉన్నాయి. హైవే అధికారి ఒకరు తెలియజేశారు .
గ్రామస్తులు ఏమంటున్నారంటే . ఈ టోల్ ప్లాజా ను 500 మీటర్లు వెనక్కి కానీ ముందుగానే జరపాలని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో టోల్ ప్లాజా నిర్మాణం అయిన తర్వాత ఈ ప్రాంతంలో వాహనాలు రాత్రి సమయంలో నిలబడటం వల్ల లారీ డ్రైవర్ లో మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తించే అవకాశం ఉందని అలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులు సమస్యలు ఎదురవుతాయి కొందరు ముందు జాగ్రత్తగా చెప్పకనే చెప్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి