బ్రహ్మంగారి ఎస్సై పై చర్యలు తీసుకోవాలి ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ఐ.
ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్.ఐ జిల్లా కమిటీలు డిమాండ్.
ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్ ని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడి అక్రమ కేసులు పెట్టి జైల్ కి పంపుతా అని బెదిరించిన బ్రహ్మంగారి మఠం ఎస్.ఐ విద్యాసాగర్ గారిపై జిల్లా ఎస్.పి గారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శులు సగిలి రాజేంద్ర ప్రసాద్, వీరణాల శివ కుమార్ లు పేర్కొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ...
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్.ఐ నాయకులను ముందస్తు అరెస్ట్ లలో భాగంగా బ్రహ్మంగారి మఠంలో ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్ ను ఈరోజు పోలీసులు వారి ఇంటికీ వెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లారని వారు తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ విద్యాసాగర్ గారు ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గండి సునీల్ కుమార్ ని నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ ఏం రా 10మందిని వెనకేసుకొని తిరిగితే పేద్ద మొగోడిని అనుకుంటున్నవా? కొవ్వు పట్టావు రా నీవు నీమీద అక్రమ కేసులు పెట్టి లోపల వేస్తా తమాషా చేస్తున్నావా అంటూ ఇంకా నోటికి వచ్చినట్లు తిడుతూ ఒక బాధ్యత యుత అధికారిగా కాకుండా వ్యక్తిగతంగా కక్ష్యపూర్తిగా వ్యవహరిస్తూ బెదిరించడం దారుణమని వారు అన్నారు. ఒక అధికారిగా ఉంది ప్రజా విద్యార్థి సంఘ నాయకులతో వ్యవహరించిన తీరు దారుణమన్నారు. నిన్న రాత్రి వస్తే ఇంటిదగ్గర లేవు ఎన్ని సార్లు రావాలి ఓయ్ సీఎం వచ్చిన ప్రతిసారి మేము ని ఇంటిదగ్గరకు రావాలా? నీవు స్టేషన్ కి వచ్చేది తెలియదా? అంటూ దుర్భాషలాడారని వారు అన్నారు. గతంలో కూడా ఎస్.ఐ సునిల్ ఇంటికి వెళ్లి మాకు చెప్పకుండా విజయవాడ వెళ్తావా? అంత మొగోడివా నీవు అంటూ అందరిముందు విద్యార్థి నాయకుడిని అవమానకరంగా మాట్లాడటం దుర్మార్గం అన్నారు. ఇలాంటి పోలీసు అధికారుల తీరు వల్ల మొత్తం డిపార్ట్మెంట్ కె చెడ్డ పేరు వస్తుందన్నారు. కావున జిల్లా పోలీసు అధికారులు ఎస్.ఐ విద్యాసాగర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ నాయక్ లు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి