మైదుకూరు నియోజకవర్గంలో గత టిడిపి ప్రభుత్వంలో వేల ఎకరాల భూములు కొట్టేసిన వైనం


 గత టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఖాజీపేట మండలంలో ఒక జాతీయ తెలుగు దేశం ఉత్తమ  నాయకుడు డికెటి భూములు  దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూములను అడ్డదారిలో ఇతరులకు బదలాయించి లబ్ధి పొందాలని తో పాటు లక్షల రూపాయలు తీసుకున్నారు.  

శివుడు రాముడు కలగలిసిన రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో వందల ఎకరాలలో డికెటి భూములు గుర్తించిన ,ఉత్తమ టిడిపి నాయకులు వారు వారి వెంట తిరుగుతున్న వారికి ఆన్లైన్  చేయించడం తో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లబ్ధిదారులకు ఇప్పించి వారి ఓటు బ్యాంకును భద్రపరచుకుని ప్రయత్నం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక గ్రామంలో దాయాదుల మధ్య గొడవ కారణం అయ్యి రౌడీల చేత కొట్టడం   కూడా జరిగింది  ఈ పరిస్థితులన్నీ చాలామంది ప్రజలకు తెలియక మంచి నాయకులు అనుకుంటున్నారు. భూములకు సంబంధించిన పూర్తి సమాచారం ఉన్నా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వాటి సర్వే నెంబర్లు ఇక్కడ ప్రస్తావించడం లేదు క్షమించగలరు

ఆ శివుడు రాముడు కలిసిన ఎమ్మార్వో శివుని మాదిరి బోలా శంకరుడు గా మారి కోరిన టిడిపి భక్తులకు భూములు ఇవ్వడం జరిగింది ఆ డికెటి భూములు అనుభవంలో ఉన్న వారికి తెలియకుండా తమ కింద తిరుగుతున్న వారి వ్యక్తులకు ఆన్లైన్ చేయించడంతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఇప్పించే బ్యాంకు నుంచి రుణం పొందారు ఆ భూములను తిరిగి వారు దక్కించుకోలేక వైకాపా అండదండలు లేక స్థానిక శాసన సభ్యుడు సహాయం అందించక ఆవేదన చెందుతున్నారు.

ఆ అనుభవదారు లు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఆవేదనకు లోనయ్యారు . వారు ఎక్కడ తిరిగినా ఫలితం లేకపోవడంతో సమయం కోసం వేచి చూడడం తో పాటు మీడియాకు తెలియజేశారు పలుకుబడి ఉన్న వాళ్లు వాటిని తిరిగి దక్కించుకోగా మిగతావారు ఇప్పుడైనా ప్రభుత్వం సహాయం చేయక పోతుందని మదన పడుతున్నారు

 

.

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...