ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు జగజీవన్ రావు జయంతి
ఈరోజు ప్రముఖ స్వాతంత్రసమరయోధుడు.మొదటి ఇండియన్ యూనియన్ దళతమినిష్టర్ ,మొదటి కాంగ్రేసేయేతర భారత ఉపప్రధాని శ్రీ బాబూ జగజ్జీవన్ రామ్ గారి జయంతి. ఈ సందర్భముగా ఆయన గురించి కొన్ని వివరాలతో పాటు ఆయన మనదేశానికి చేసిన సేవలను ఒకసారి గుర్తుచేసుకొందాము.
జగజీవన్ రాం గారు 1908 ఏఫ్రెల్ 5 న బీహార్ రాష్ట్రంలోని బోజ్ పూర్ జిల్లా చంద్వా గ్రామం లో షోభిరామ్ ,వాసంతిదేవి అనే దంపతులకు జన్మించారు.షోభిరామ్ గారు బ్రిటీష్ ఆర్మీలో సిపాయిగా పనిచేస్తూ తన దేశపౌరులమీదే తుపాకి ఎక్కుపెట్టడం ఇష్టంలేక తన ఉద్యోగానికి రాజనామా చేసి తన ఊరిలోనే వ్యవసాయం చేసుకోనేవాడు. అయితే దరుదృష్టవశాత్తు రాం గారి ఎనిమిదో యేట కాలధర్మం చెందారు. అయితే వాసంతదేవి తన కుమారుడిని చదువు ఆపనీయకుండా కష్టపడి చదివించింది. రామ్ గారు కూడా చాలా చురుకైన విద్యార్థిగా పేరుతెచ్చుకొన్నారు,
1922లో అహ్నహ టవున్ స్కూల్ నందు చేరేడు.అయితే అక్కడ అంటరాని తనమును ఎదుర్కొవలసివచ్చింది. అయినా అధైర్యపడలేదు.
అదే సమయంలో అంటరానితనానికి వ్యతిరేఖంగా మదన్ మోహన్ మాలవ్య గారు ఆ కాలేజ్ లో సమావేశము ఏర్పాటుచేశారు. మాలవ్య గారి మాటలకు ఆకర్షితుడై ఆయన శిష్యుడిగా మారిపోయారు.స్వాతంత్ర ఉద్యమం వైపు ఆకర్షితులైనారు.
అక్కడ నుండి హిందూ బెనారీస్ కాలేజ్ లోచేరినారు. తరువాత కలకత్తా యూనివర్సిటీలో చేరి బి.యస్సీ పూర్తిచేసారు. అప్పుడే సుభాష్ చంద్రబోస్ గారి సభను విజయవంతం చేసేందుకు జనసమీకరణ భాద్యత తీసుకొని విజయవంతంగా పూర్తిచేశారు.1934లో బీహార్ లో భయంకరమైన భూకంపం రాగా సహాయచర్యలలో పాల్గొని అందరు దృష్టిని ఆకర్షించారు.1935లో బీహార్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ చేయపడ్డారు.అప్పటికి మొదటిభార్య చనిపోయి రెండు సంవత్సరాలైన తరువాత ఇంద్రాణిదేవి గారితో ఇదే సంవత్సరంలో వివాహం జరిగింది. తరువాత భారతజాతీయకాంగ్రీస్ లో చేరారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 4సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.నెహ్రూ గారి కాబినేట్ లో మొదటి లేబర్ మీనిష్టర్ గానూ తరువాత కమ్యునికేషన్ ,ట్రాన్స్ పోర్టు , రైల్వేస్ మొదలగు శాఖలను సమర్థవంతంగా నిర్వహించి ,అందరిమన్నలను పొందారు.
1972లో ఇందిరాగాంధి కాబినేట్ లో లేబర్ ,ఎంప్లాయ్ మెంట్ ,రీ హాబిటేషన్ ,ఫుడ్ మరియు అగ్రికల్చర్ ,రక్షణశాఖ లను నిర్వహించారు.ఇండో-పాక్ యుద్దంలోభారత్ విజయం సాధించడంలో ఇతను పాత్రకూడా వుంది.స్వామినాధన్ ను ప్రోత్సహించి హరితవిప్లవానికి నాంది పలకేరు. అలాగే భూమి లేని పేదలకు ,సన్నకారురైతుల అభ్యున్నతికి ఇతను తీసుకొన్న నిర్ణయాలు పలువురి ప్రశంసలు పొందాయి,
అయితే 1975లో ఎమర్జన్సీకి వ్యతిరేఖంగా ఇందిరాగాంధీతో విభేదించి కాంగ్రేసు నుండి బయటకు వచ్చి డెమొక్రిటిక్ కాంగ్రీస్ ను స్తాపించారు. ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీతో అవగాహన కుదిరించుకొని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత భారతదేశ తొలి దళిత ఉపప్రధానిగా భాద్యతలు చేపట్టారు.అయితే 1979 లో భారతదేశ తొలి దళిత ప్రధాని అయ్యె అవకాశం తృటిలో కోల్పోయాడు. చరణ్ సింగ్ లాబీయంగ్ వల్ల ఈ అవకాశం పోయి రెండుసార్లూ ఉపప్రధానిగానే మిగిలిపోయారు. జూలై 6 1986లో పరమదించారు,
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి