కాజీపేట రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు..

కడప జిల్లా నుంచి అత్యధికంగా రేషన్ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయర్స్ అందించడంలో మైదుకూరు మొదటి స్థానంలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే .అయితే ఇక్కడ  పోలీసులు గాని రెవెన్యూ అధికారులు గాని ఈ బియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేసిన సందర్భం లేదు అలా పట్టుకున్న వాటిని రేషన్ బియ్యం కాదని రెవెన్యూ అధికారులు రాయడం పోలీసులు వదిలి పెట్టడం మామూలే.

ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే తెలియక కిందిస్థాయి పోలీసులు ఎవరైనా పట్టుకుంటే వారికి ఆ రోజు అక్షింతలు తప్పవు , అక్షింతలు అంటే తలంబ్రాలు అనుకుంటారేమో అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే పై అధికారుల నుంచి బూతు పురాణం తో వారి చెవులకు తూట్లు పడాల్సిందే.            


రేషన్ బియ్యం ఎలా పట్టుకున్నారని మీ లో అందరు లో ఆలోచన రావచ్చు అది కడపకు చెందిన విజిలెన్స్ అధికారులు చుట్టం చూపుగా పట్టుకున్నారు

విజిలెన్స్ అధికారిని వివరణ అడగగా దాని మీద మేము దృష్టి పెట్టలేదని అలా పెట్టడం వల్ల గతంలో రెండు వందలు రేషన్ కార్డులు ప్రభుత్వం తొలగించిందని అందువల్ల మమ్మల్ని తిట్టుకుంటున్నారు అని మేము వాటి మీద దృష్టి పెట్టలేదని  నవ్వుతూ చెప్పడం విశేషం.

గ్రామాలలో రేషన్ బియ్యం వాడే నాధుడే లేడు  వాటిని రీసైక్లింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇవి తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని ఆందోళన పడక తప్పదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...