ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి తెర ?

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసేది మరో ఎత్తు. ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్లో  దశలవారీగా  మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఆ పథకం ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది అంటే అతిశయోక్తి కాదు.

ఇవన్నీ పక్కనపెట్టి ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు రైతుల నెత్తిన బాంబు వేయనుంది  ఏమిటని బుర్రలు బద్ధలు కొట్టి కోకండి. రైతులను ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు కొత్త పంథాకు తెరతసింది   ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా చక్కెర కర్మాగారాల్లో మూసివేయడంతో ఇతర దేశాల నుంచి చక్కెర దిగుమతి చేసుకునే పరిస్థితి గత ప్రభుత్వం  చేసిన రైతుల కు గుదిబండగా తయారయింది.

అత్యధికంగా కడప జిల్లా చిత్తూరు జిల్లాలో చెరుకు పండించే రైతులు ఉన్నారు ఆ రైతులు ఏదో ఒక దారిలో బెల్లం తయారు చేసి బతుకు సాగిస్తున్న రైతులకు ఇప్పుడు ప్రభుత్వం చేసిన కొత్త నినాదంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు.

 రైతులు చేసిన బెల్లాన్ని వ్యాపారస్తులు కొనకుండా ప్రభుత్వానికి అమ్మాలని కొత్త నినాదం తెచ్చి, రైతులు తయారుచేస్తున్న బెల్లం ప్రభుత్వం కొనుగోలు చేసి తద్వారా రేషన్ డీలర్లకు పంపించి అక్కడి నుంచి అక్కడినుంచి కిరాణా షాపులకు ప్రతినెలా పంపించి, వాళ్ళ అమ్మకం చేయాలని ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేసింది.

ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని మీరు అనుకుంటే అది మీ తప్పే అవుతుంది ఇక్కడే ఉంది అసలు కారణం ముఖ్యమంత్రి కి ఎవరు సలహాలిస్తున్నారు గాని అది ఏమటి అని మీరు అనుకోవచ్చు రైతుల తయారుచేసిన బెల్లాన్ని "సారాయి" తయారు చేస్తున్నారని చెప్పడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని బెల్లం రైతులు నేరుగా వ్యాపారస్తులు ఆమ్మకూడదని అలా జరుగుతే వ్యాపారస్తులు రైతుల పైన తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది  ఈ పథకాన్ని  రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం 


చేయబోతుంది ఇప్పటికే రేషన్ డీలర్లకు ఈ విషయంపై తగిన సంకేతాలు కూడా అందినట్లు సమాచారం 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...