దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు తీవ్ర అన్యాయం

 దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉటాయని కాజీపేట మండల అభివృద్ధి అధికారి కి కలిసి వినతిపత్రం సమర్పించిన  కార్మిక సంఘాలు.

ఈ ఏడాది జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి బడ్జెట్లో 25వేల కోట్ల రూపాయలు తగ్గించి  కూలీలు అన్యాయం చేయడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇప్పటికే వ్యవసాయరంగం దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో భారీ యంత్రాల పని చేయడం వల్ల ఉపాధి కూలీలకు పని శాతం తగ్గిపోయి ఉపాధి కూలీలు అందరూ వలస వెళ్లే పరిస్థితి తలెత్తిందని అందువలన జీవో 31 వెంటనే రద్దు చేసి ఉపాధి హామీ ఆదుకోవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

ఎంపీడీవోవినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడుశివ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యుడు దుగ్గి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పుల్లూరు నారాయణ, రాష్ట్ర మాలమహానాడు రాయలసీమ అధ్యక్షుడు గుణం పాట వెంకటరమణ, ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సభ్యులు మరియు అన్న, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...