కడప జిల్లా జాయింట్ డైరెక్టర్ జయ ప్రకాష్ పై విచారణ జరపాలి ఏఐఎస్ఎఫ్.
కడప జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యస్ ఎఫ్ ఐ కడప జిల్లా కమిటీ సభ్యులు దుగ్గిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.
సీఎం సొంత జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో అవినీతి తారస్థాయిలో ఉందని, కడప జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ గారి అవిననీతిపై అనేక ఆరోపణలు ఉన్న ఎలాంటి విచారణ జరపలేదని వారు అన్నారు. గతంలో సంక్షేమ హాస్టల్స్ లో గత 20, 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న వర్కర్స్ కి ఇవ్వాల్సిన పీఎఫ్ డబ్బులు వారి పీఎఫ్ అకౌంట్లో వేయకుండా అప్పటి కాంట్రాక్టర్ పెంచలయ్యతో జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ గారు కుమ్మక్కై పెద్దఎత్తున భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని వారు తెలిపారు.
కాంట్రాక్టర్ పెంచలయ్య నుండి లక్షల రూపాయలు జయప్రకాష్ గారు మామూళ్లు తీసుకొని పీఎఫ్ డబ్బుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. హాస్టల్ లో పనిచేస్తున్న పేద, మధ్యతరగతి వారు అడిగితే వారిని ఉద్యోగంలోనుండి తొలగిస్తాం అని బెదిరిస్తూ అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని వారు అన్నారు. కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ సమయంలో బద్వేలు కోవిడ్ ఐసోలేషన్ లో వార్డెన్స్ నుండి ఒక్కొక వార్డెన్ నుండి 50వేలు, 40 వేలు, 30 వేలు డబ్బులు ఖర్చు పెట్టించి బిల్లు అవ్వగానే తిరిగి ఇస్తానని చెప్పి జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ గారు బిల్లులు అవ్వగానే తిరిగి డబ్బులు ఇవ్వకుండా కాజేశారని వారు తెలిపారు.
జాయింట్ డైరెక్టర్ గారు కావడంతో క్రింది స్థాయిలో పనిచేసే వార్డెన్స్ డబ్బులు అడగలేక తెచ్చిపెట్టిన అప్పులు కట్టలేక ఇబ్బందులు పడ్డారని వారు అన్నారు. అంతే కాకుండా కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ లో దాతలు ఇచ్చిన వస్తువులకు కూడా బిల్లులు పెట్టి ప్రభుత్వ సొమ్ము కాజేశారని వారు తెలిపారు. హాస్టల్స్ లో మిగిలిపోయిన దుప్పట్లు కోవిడ్ పేషంట్స్ కి వాడి వాటికి కూడా బిల్లులుపెట్టి ప్రభుత్వ సొమ్ము కాజేశారని వారు తెలిపారు. బద్వేలు గర్ల్స్ హాస్టల్ వార్డెన్ లక్ష్మీ దేవి గారి సర్టిఫికెట్స్ పై విచారణ జరపకుండా లక్షల రూపాయలు లంచం తీసుకొని జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ గారు అక్రమ మార్గంలో గ్రేడ్1 వార్డెన్ గా ప్రమోషన్ ఇచ్చారని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వార్డెన్స్ నుండి ప్రతి నెల ఒక్కొక్క విద్యార్థి నుండి స్కూల్ హాస్టల్ విద్యార్థుల నుండి 50, కాలేజ్ హాస్టల్ విద్యార్థుల నుండి 100 రూపాయల చొప్పున మాముళ్ళు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. హాస్టల్స్ వార్డెన్స్ విద్యార్థుల తో స్కూల్స్, ఇళ్ల దగ్గర వేలిముద్రలు తీసుకొని అక్రమాలకు పాల్పడుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలాంటి వార్డెన్స్ తో కుమ్మక్కై చర్యలు తీసుకోకుండా వార్డెన్స్ కి కొమ్ము కాస్తూ అక్రమ సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారని వారు అన్నారు.
బద్వేలు లోని ఎస్.సి హాస్టల్ లో ట్యూటర్స్ పేరుతో తప్పుడు బిల్లులు పెట్టి లక్షల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని వారు తెలిపారు. కడప జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ గా జయప్రకాష్ గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఏ ఒక్క హాస్టల్ ను కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ.ఎస్.డబ్ల్యూ.ఓ లను బినామిలుగా పెట్టుకొని అక్రమంగా సంపాదన పై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేయడం లేదన్నారు. నెల నెలా ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ గారి పై సాంఘిక సంక్షేమ శాఖ తో సంబంధం లేని అధికారులతో ఐ.ఏ.ఎస్ స్థాయి అధికారులతో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు అన్నారు. అవినీతి కి పాల్పడుతున్న జయప్రకాష్ గారిని విధుల నుండి తప్పించి విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ ఖాజిపేట మండల అధ్యక్షుడు రవివర్మ, మండల ఉపాధ్యక్షుడు మధన్,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి