ఎర్రచందనం కోసం మళ్ళీ అడవిలో అలజడి ?
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎర్రచందనం రవాణా ఎక్కువగా రవాణా కడప జిల్లా నుంచి జరుగుతుండగా గత కొద్ది రోజులుగా కొద్దిగా స్తబ్దుగా ఉన్న రవాణా దారులు గత ఇరవై రోజుల నుంచి మళ్లీ వాళ్ల రవణా ప్రారంభించినారు అంటే అతిశయోక్తి లేదు
గత కొద్ది కాలంగా రవాణా చేస్తున్న వారికి కొనుగోలుదారులు పంపించిన సరుకు డబ్బులు చెల్లించకపోవడంతో ప్రధాన కారణమని కొందరు ఎర్రచందనం రవాణా దారులు తెలియజేశారు ఇప్పుడు మళ్ళీ రవాణా పుంజుకోవడంతో తమిళ ఎర్రచందనం కూలీల అటవీ ప్రాంతంలో సంచార మొదలు కావడంతో స్థానికుల సహకారం తో అటవీ ప్రాంతంలో కి వెళ్లినట్లు కొందరు గ్రామస్తులు తెలియజేశారు
అంతేకాకుండా మైదుకూరు ప్రాంతంలో గట్టిగా బందోబస్తు నిర్వహిస్తున్న సందర్భాలు ఉండేవి ఇప్పుడు రాత్రి సమయాల్లో పోలీసులు కానీ ఇటు అటవీశాఖ అధికారులు గాని గస్తీ నిర్వహించకపోవడంతో రవాణా కొత్త పుంతలు తొక్కుతున్న అంటే ఆశ్చర్యం లేదు
మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులు రాత్రి సమయాలలో ఎవరు ఉండకపోవడం ఒక ఎత్తయితే ఉన్న చెక్ పోస్ట్ కాజీపేట ఒకరి గస్తీ కాయడం దువ్వూరు సమీపంలో చెక్ పోస్ట్ ని తొలగించడం వారికి వరంగా మారింది . ఇదే అదునుగా తీసుకుని ఎర్రచందనం రవాణా సాగిస్తున్నారు కాజీపేట ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కోసం గత వారం రోజుల్లో సుమారు 50 మంది వరకు తమిళ కూలీలు కొండ ప్రాంతంలో కి వెళ్లినట్లు స్థానిక రైతులు తెలియజేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి