కాజీపేట సిపిఎం ఇంటింటికి ప్రోగ్రాములు సమస్యల వెల్లువ ?

 కాజీపేట లో సిపిఎం నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ  కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పత్తూరు పంచాయతీలు కార్యక్రమం నిర్వహించారు

సిపిఎం* కాజీపేట మండలం కేంద్రమైన పాత పత్తూరు లో చిన్నపాటి వర్షానికి రోడ్లమీద వర్షపు నీరు పొంగి ప్రవహిస్తున్న దని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దస్తగిరి రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రజా సమస్యల అధ్యయన యాత్ర పాత పత్తూరు గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. 

వర్షపు నీరు పొయ్యి  మార్గం లేక రోడ్డుపైనే రోజుల తరబడి నిలిచి ఉన్నదని తద్వారా దోమలు వ్యాప్తి చెంది ప్రజలు మలేరియా టైఫాయిడ్ జ్వరాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారని ఆయన తెలిపారు. సచివాలయ వ్యవస్థ వాలంటరీ లు వచ్చినా కూడా సమస్యలు ఏ మాత్రం పరిష్కారం కావడం లేదని ఆయన తెలిపారు. 

గ్రామపంచాయతీ అధికారులు ప్రజా ప్రతినిధులు శ్రద్ధ పెట్టి  వర్షపు నీరు బయటకు పోయేందుకు చర్యలు తీసుకోవాలని అని ఆయన కోరారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా వాలంటరీ లకు చెప్పిన ఏ మాత్రం ప్రయోజనం లేదని అక్కడ ఉన్న ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలకు రూపకల్పన చేస్తామని ఆయన తెలిపారు


పర్యటన కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు దుగ్గి రెడ్డి రాజశేఖర్ రెడ్డి , నారాయణ తో పాటు స్థానికులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...