బడి కోసం బస్సు యాత్ర
(కాజీపేట జే సి ఎన్ న్యూస్) బడి కోసం బస్సు యాత్ర పేరుతో పాఠశాలల విలీనంపై సమర శంఖం పూజించిన యుటిఎఫ్ ప్రభుత్వ నినాదాలకు వ్యతిరేకంగా చేపట్టిన బస్సు యాత్ర రేపు కాజీపేట లో నిర్వహించనున్న సందర్భంగా తల్లిదండ్రులకు ఇదే మా ఆహ్వానం యుటిఎఫ్
జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే సాకుతో ప్రాథమిక పాఠశాలలను, సమీప ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రను మానుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ,విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బడి కోసం బస్సు యాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదన విజయ కుమార్ పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ముందు పేద,బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని అమలు చేయకపోగా పేదలకు విద్యను దూరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే పాఠశాలల విలీనం పేరుతో ఉపాధ్యాయ పోస్టుల కుదింపు, పాఠశాలల మూసివేతకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నాణ్యమైన విద్య అందజేయడం అంటే పాఠశాలను మూసి వేయడమా అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల ప్రమేయం ఏమాత్రం లేకుండా విలీనం పేరుతో ఇతర పాఠశాలలకు బలవంతంగా తరలించడం వల్ల విద్యార్థులు పాఠశాలకు, చదువుకు దూరమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల విలీనం ప్రభుత్వ పాలసీ అని, దీనిపై ఉపాధ్యాయులు ప్రశ్నించకూడదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం పట్ల ఆయన అభ్యంతర వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు నష్టం జరిగినప్పుడు ప్రశ్నించడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు*
యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్, మండల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున, సుబ్బారెడ్డి, నాయకులు రవి చంద్రారెడ్డి, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి