కాజీపేట ప్రజల సమస్యలు ఇప్పుడైనా తీరునా ?
కాజీపేటలో గత మూడు సంవత్సరాల నుంచి రెవెన్యూ సమస్యలు తో ఇబ్బందులు పడ్డ ప్రజలకు వచ్చిన కొత్త ఎమ్మార్వో తో కొత్త ఆశలతో ఎదురుచూపు.
గత ఎమ్మార్వో సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేలకు అండదండలుగా ఉండడంతో సామాన్య ప్రజల రెవిన్యూ సమస్యలు తీరకపోగా గ్రామాలలో కక్షలకు దారి తీశారు గత ఎమ్మార్వో నా మూడు సంవత్సరాల లో సుమారు 10 శాతం కూడా సమస్యలు తీరక ప్రజలు ఇబ్బంది పడ్డారు ఎమ్మెల్యేతో చెప్పిస్తే గాని చిన్న సమస్య కూడా తీరేది కాదని కొందరు ప్రజలు చెప్పకనే చెప్తున్నారు
పెద్ద సమస్య అయితే అసలు పలికే పరిస్థితి లేదని.కొందరు ప్రజలు చైతన్యవంతులు గట్టిగా అడుగుతే చూద్దాం మరీ గట్టిగా అడిగితే కోర్టుకెళ్లండి అని పరిస్థితి ఉండేది గత ఎమ్మార్వో సూరి నారాయణరెడ్డి సమయంలో అక్రమ మైనింగ్ రాజ్యమేలేది అంతేకాకుండా ఇసుక మట్టి గ్రావెల్ ఇవేవీ వదలకుండా అక్రమ రవాణా జరిగేది ఇప్పుడు వచ్చిన కొత్త ఎంఆర్ఓ వల్ల ఈ సమస్యలు తీరున ?
గత ఎమ్మార్వో వల్ల భూ సమస్యలు ఇంటి సమస్యలు డీకేటి భూములను ఆక్రమణ కుందూ నది భూముల ఆక్రమణ మరెన్నో. ఇది తప్పని చెప్పే పరిస్థితి లేక పోవడం కొసమెరుపు ముఖ్యంగా ఇండ్లు లేని వారికి ఒకటిన్నర సెంటు ఇండ్లు స్థలం పట్టాలు ఇవ్వలేకపోవడం పట్టాలు ఉన్న ఇండ్లను రాజకీయ వత్తుల వల్ల ఆపడం ఎక్కువగా అధికార పార్టీ కంటే ప్రతిపక్షానికి మద్దతు పలకడం విశేషం అంతేకాకుండా చాలా విషయాల కోసం వందలసార్లు తిరిగిన ఫలితం లేక వచ్చే ఎమ్మార్వో అయినా తమ గోడు వినకపోతారని ఎదురు చూస్తున్న ప్రజలు.
గత రెండు సంవత్సరాల నుంచి ఇన్ని సమస్యల వల్ల కొత్త ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరించడం ఎంతవరకు ప్రజలకు మేలు జరుగుతుందని ఆశాభావంతో ఎదురుచూపు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి