రైతులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం ?


(జే సి ఎన్ న్యూస్ ఖాజీపేట) కర్నూలు జాతీయ రహదారి కుమ్మర కొట్టాల సమీపంలో గ్రామస్తులు బీరం రమణారెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం పాత బ్రిడ్జిని కాదని జాతీయ రహదారి నుంచి కొత్త వంతెన కోసం కోటి 30 లక్షలు తో బ్రిడ్జిని శాంక్షన్ చేయించుకుని దారి మళ్లింపు నాంది పలికాడని ఈ దారి మళ్లింపు వల్ల ఆయనకు సొంత ప్రయోజనాలు చేకూరుతాయి తప్ప గ్రామస్తులు కానీ ఆయకట్టుగాని ఎలాంటి ప్రయోజనం చేకూడదని వారి భూములకు నీళ్లు త్వరగా పారుతాయని ఇలాంటి ప్రయోజనాలకు ఒడిగట్టాడని గ్రామస్తులు తెలియజేశారు

పాత  వంతెన ద్వారా సుమారు 500 ఎకరాలు ఆయకట్టు పారుదల ఉండగా అక్కడి నుంచి మూడు భాగాలుగా విడిపోయి పెద్ద ద్వారం ద్వారా 300 ఎకరాలు మరో చిన్న ద్వారం ద్వారా 50 ఎకరాలు మరో మధ్య రకం ద్వారం ద్వారా 150 ఎకరాలు పారుతాయని ఆ 150 ఎకరాల ద్వారం ద్వారా  సొంత ప్రయోజనాల కోసం డైరెక్టుగా వారి భూములకు నీళ్లు వచ్చే విధంగా దారి మళ్లింపు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు 

అలా మళ్లించడం ద్వారా తీవ్రంగా నష్టపోతామని చివరి ఆయకట్టు రైతులకు నీరు అందక రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుందని గతం లో పెట్టిన కేసు పది సంవత్సరాలకు కూడా పరిష్కారం కాక కోట్లు చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయని భూమాయపల్లె  గ్రామస్తులు కేసు కెనాల్ ఇంజనీర్ కు తెలియజేశారు
 
కేసి కెనాల్ డివిజనల్ అధికారులను వివరణ అడుగగా మా వద్ద నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని అలా తీసుకుంటే కేసులు పెడతాము అంటున్న డివిజనల్ ఇంజనీర్ 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...