జాతీయ రహదారి రాస్తారోకులో బలి పశువు అయిన పంచాయతీ సెక్రెటరీ .

 జులై రెండవ తేదీ కడప కర్నూల్ జాతీయ రహదారి టోల్ ప్లాజా సమీపంలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన రాస్తారోకోలు బలిపశువైనా దుంపలగట్టు పంచాయతీ సెక్రెటరీ 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ పార్లమెంటులో వెంటనే వర్గీకరణ బిల్లు పెట్టి ప్రభుత్వము తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు

ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన సందర్భంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తో తమ సమస్యల పైన చర్చించాలని పట్టుబట్టిన అక్కడ అధికార యంత్రాంగం తమ అందరిని గృహనిర్బంధం చేశారని దానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాలలో రాస్తారోకో నిర్వహించడానికి సన్నద్ధమయ్యాము

రాస్తారోకో సందర్భంగా జాతీయ రహదారి దుంపలగట్టు సమీపంలో నిర్వహించిన రాస్తారోకోలు ఎమ్మార్పీఎస్ నాయకులతో కనీసం మాట మంతి లేకుండా ఇష్టానుసారంగా రోడ్డుపైన పోలీసులు చొక్కాలు  పట్టుకొని లాగడం. చింపడం  దారుణమని కనీసం స్థానిక సీఐ ఒకరితో కూడా మాట్లాడకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయడం తగదని మేము చాలా ధర్నాలు రాస్తారోకోలు చేసాము కానీ ఇలాంటి వింత ప్రవర్తనతో ప్రవర్తించిన సిఐ ఎక్కడా లేదని వెంటనే సిఐ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు  తెలియజేశారు మైదుకూరు రూరల్ సీఐ నరేందర్ రెడ్డి ఎంఆర్పిఎస్ నాయకులతో మాట్లాడకుండా ఇలాంటి దుర్చర్ల కు పాల్పడడం ఏమాత్రం భావ్యంగా లేదని ఎప్పుడైనా ధర్నా జరిగితే మీరు పది నిమిషాలు చేసి లేవాలి లేకపోతే ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పకుండా నాయకులతో మాట్లాడకుండా ఇష్టాన్ని చాలా ప్రవర్తించడం అధికారానికి పరాకాష్టమి తయారయింది

ఇదంతా పక్కన పెడితే స్థానిక పంచాయతీ సెక్రెటరీ (అన్నపురెడ్డి నారాయణరెడ్డి ) స్థానిక పోలీస్ స్టేషన్లో l


ద్వారా కంప్లైంట్ ఇప్పించడం ఏమిటని అందులో రాస్తారోకో  పంచాయతీ సెక్రెటరీ కి ఏం సంబంధం మా మీద పంచాయతీ సెక్రెటరీ  కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆయనను బలి పశువు చేశారని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు తెలియజేశారు ఇప్పుడైనా తమ పైన వెంటనే కేసు ఎత్తివేయాలని లేకపోతే పంచాయతీ సెక్రెటరీ పై కేసు నమోదు చేయాలని మీడియాకు తెలియజేశారు 

జిల్లాస్థాయి ఎమ్మార్పీఎస్ నాయకుల పై 8 మంది వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మహేష్ తెలియజేశారు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...