అక్రమార్కులకు అడ్డాగా చెక్ పోస్టులు

 మూతబడ్డ రెడ్ శాండిల్ చెక్ పోస్ట్ తూతూ మంత్రంగా విధులు తనిఖీలకు నోచుకోని పోలీస్ సిబ్బంది

ఖాజీపేట


మండలం కొండారెడ్డి నగర్ సమీపంలోని చెక్ పోస్ట్  గత చాలా సంవత్సరాల నుండి ఎర్రచందనం రవాణా ను కట్టడి చేయడానికి మరియు అక్రమ నిషేధ వస్తువులను పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది

కానీ గత మూడు రోజుల నుండి చెక్ పోస్ట్ ను పూర్తిగా అక్రమార్కులకు ఆనందదాయకంగా ఉండడం విశేషం  కడప కర్నూల్  జాతీయ రహదారి వెంబడి ఎర్రచందనం అక్రమ రవాణా కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కారణంగా అరికట్టాల్సిన అటివిశాఖ మరియు పోలీస్ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి అక్రమార్కులకు సహకరిస్తూ అలాగే పోలీసు యంత్రాంగంలోని కొంతమంది సిబ్బంది స్మగ్లర్లకు సమాచారాన్ని అధికార పార్టీ నాయకుడు తెలియజేయడం విశేషం దగ్గరుండి స్మగ్లర్ల చేత ఎర్రచందనం రాష్ట్రాలను దాటిస్తున్నారు.

దీని అరికట్టాలని ప్రభుత్వం చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తే ఆ చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహించవలసిన పోలీస్ సిబ్బంది విధులకు హాజరు కాకుండా పూర్తిగా చెక్ పోస్ట్ ను మూసివేసి అక్రమార్కులకు రాజ మార్గంగా ఏర్పాటు చేశారు ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి దాదాపు పది సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు అక్కడ ఎలాంటి ఎర్రచందనం కానీ అక్రమ రవాణాకు సంబంధించిన నిషేధ వస్తువులు గాని పట్టుబడకపోవడం వాళ్ల విధి నిర్వహణ నిలువెత్తు నిదర్శనం ఇక్కడ ఉన్న సిబ్బందికి ఎలాంటి అధికారాలు గాని ఆయుధాలుగాని సరైన వసతులు  సమర్పించకుండా నియమించి తూతూ మంత్రంగా చెక్పోస్ట్ ను ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు బలం చేకూరడం విశేషం  ఇప్పటికైనా ఉన్న అధికారులు కళ్ళు తెరిచి వెంటనే చెక్పోస్ట్ ను తెరిచి అక్రమంగా తరలి వెళ్తున్న ఎర్రచందనం మరియు ఇసుక మరియు అక్రమ నిషేధ వస్తువుల వాహనాలను తనిఖీ చేసి పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి