రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నిరాహార దీక్షలు ముగింపు

 పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి


తగిన న్యాయం చేయాలని ఈ పార్లమెంటు సమావేశాలలోనే వర్గీకరణను పూర్తిచేయాలని గత 20 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుమని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలియజేయడంతో పాటు స్థానిక కాజీపేట మండల రెవెన్యూ ఆఫీసర్ రమణారెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది


  మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్సీ ఉప కులాల  ఏ బి సి డి ల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని ఈనెల 20వ తారీఖున మొదలైన పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించగా. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు ఎస్సీల వర్గీకరణ ఊసుకపోగా అర్ధాంతరంగా ఈ పార్లమెంటు సమావేశాలలో రద్దు చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ 

ఈరోజు ఖాజీపేట ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది  ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ మానికింది వెంకటేష్  మాదిగ, msp నాయకులు మహేష్, రాజా ప్రభాకర్,విజయ్, వెంకటపతి, బాలవీరయ్య బలగంగయ్య రాజా, గంగులయ్య 

రమణ తదితరులు  పాల్గొన్నారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...