ఖాజీపేట లో రెప్పపాటులో బైకులు మాయం
ఖాజీపేట (జే సి ఎన్ న్యూస్) . కళ్ళు మూశారో బైకులు గోవిందా గోవిందా.
ఇదేమిటి వింత పదం అనుకుంటున్నారా ఇది అక్షరాల నిజం గత రెండు రోజుల నుండి కాజీపేట మండల పరిధిలోని కొండయ్య డాబా సమీపంలో ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ లో విధుల్లో ఉన్న ఒక హోంగార్డ్ ద్విచక్ర వాహనంని దొంగలు ఎత్తుకెళ్లారు అర్థం చేసుకోండి సామాన్యుల పరిస్థితి ఏమిటో ఒక విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది వాహనమే దొంగతనాన్ని గురైందంటే మండలంలో సామాన్యులకు ప్రజలకు రక్షణ ఎక్కడుందో మీరే అర్థం చేసుకోవాలి
పోలీస్ చెక్ పోస్ట్ అంటే అక్రమ రవాణా నియంత్రించడం మరియు వాహనాలు తనిఖీ చేసి దొంగలు పట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ జరగదు అక్కడ ఉండేది ఒక సిబ్బంది మాత్రమే అలాగే మండలంలో అనేక దొంగతనాలు అక్రమంగా ఇసుక గుట్కా ఎర్రచందనం మరియు అనేక అక్రమాలు జరుగుతున్నప్పటికీ పోలీస్ స్టేషన్లో కొంతమంది సిబ్బంది మత్తు మైకంలో విధులు నిర్వహిస్తూ అక్రమార్కులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇది అణువుగా భావించిన దొంగలు ఏకంగా మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు గతంలో అనేక దొంగతనాలు పోలీసుల నిఘా కనబడడం లేదు
బైకులు దొంగలు ఇద్దరిని పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఐదు బైకులు స్వాధీనం చేసుకుని మీడియా ముందు హాజరు పరిచిన పోలీసులు కాజీపేట మండలం పూసల కొట్టాలు చెందిన నరేందర్ రెడ్డి సంజీవనగర్ చెందిన ప్రభాకర్. వీరి దగ్గర నుంచి సుమారు 6 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి