దేశ రక్షణ కరపత్రాలు విడుదల
భారతదేశంలో రోజురోజుకు కార్పొరేట్ సంస్థలకు కట్టబడుతున్న సంపదను వెంటనే అడ్డుకునే దిశగా ప్రయత్నం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా దేశ ప్రజల సంపదను మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ దేశ రక్షణ కోరకు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం ఖాజిపేట మండల కమిటీ సభ్యులు దుగ్గి రెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు*
సెప్టెంబర్ 14 నుండి 27 వరకు దేశ రక్షణ బేరి పిలుపులో భాగంగ సిపిఎం ఖాజిపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ఖాజిపేట మండల సభ్యులు దుగ్గి రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను చట్టాలు మార్పు చేసి కార్పొరేట్లకు చుట్టాలుగా మార్చిన చరిత్ర మోడీడి అన్నారు మోడీ సహచరుడైన ఆదాని ప్రపంచ కుబేరుల జాబితాలో మూడు నుండి రెండో స్థానానికి ఎగబాకినటువంటి చరిత్ర మోడీ విధానాలే కారణమయ్య అన్నారు దేశానికి వెన్నెముక రైతు అంటారు తప్ప ఆ వెన్నుముక విరిసే నల్ల చట్టాలను తీసుకొచ్చింది మోడీ అన్నారు మరోపక్క ఐదు కోట్ల ఆంధ్రులను ప్రత్యేక హోదా విషయంలో మోడీ మోసం చేసారని దానికి రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారన్నారు
సిపిఎం సీనియర్ నాయకులు బచ్చల వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఈ దేశాన్ని కార్పొరేట్ల నుండి కాపాడాలని కోరుతూ ఈనెల 21వ తేదీన ఉదయం10 గంటలకు అగ్రహారం లోని పాత సాహిత్య కాలేజ్ లో సభ నీర్వహించడం జరుగుతుంది ప్రజలు అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు,ఈ దేశంలో నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షలు వేస్తానని చెప్పిన హామీ ఏమైందో ఎవరికీ తెలియదు నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్న ధరలు తగ్గించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ కార్యక్రమంలో ఖాజిపేట సిపిఎం మండల కమిటీ సభ్యులు పుల్లురు నారాయణ, రవివర్మ, గణేష్, శివరాం, సురేంద్ర, నాగేంద్ర,ఇస్మాయిల్, లడ్డు, హసను ,శేఖర్, రీయజు, నారాయణ, రాజేష్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి