పౌష్టికాహార సంస్థల నిర్వాకం
కాజీపేట( జే సి ఎన్ న్యూస్) ప్రభుత్వము పిల్లలకు మెరుగైన పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో కోట్లు ఖర్చవుతున్న ఏమాత్రం లెక్క చేయకుండా . మంచి పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో అంగన్వాడి మరియు ఇతర సంస్థలకు గుడ్లను పంపిణీ చేయడం తెలిసిన విషయమే.
అయితే ఇక్కడే వచ్చింది తిరకాసు ఆ గుడ్లను పంపిణీ చేస్తున్న సంస్థలు సరి అయిన ప్రదేశాలలో నిలువ ఉంచకపోవడం తో ఆ గుడ్లు చెడిపోయే పిల్లలు అనారోగ్య పాలు కావడం జరుగుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్క అంగన్వాడీ సెంటర్లకే కాకుండా మైదుకూరు నియోజకవర్గంలోనే చాలా విద్యాసంస్థలకు నాసిరకం గుడ్లు అందజేయడం వల్ల అంగన్వాడి ఇతర స్కూల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు
ముఖ్యంగా కాజీపేటలో నిలువ ఉంచుతున్న ప్రాంతంలో ఏ మాత్రం గాలి వెలుతురు లేకపోవడంతో ఆ గుడ్లు త్వరగా పాడవుతున్నాయని తగిన నిర్వహణ లేకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఆ గుడ్లను తింటే మా పిల్లలు పరిస్థితి ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆవేదన చెందడం ఒక తీరైతే ఆ నిల్వ ఉంచుతున్న ప్రాంతంలో చెడిపోయిన గుడ్లను బయట పారేయడం వల్ల చుట్టుపక్కల వారికి దుర్వాసనతో బెంబేలెత్తుతున్న పరిస్థితి
సరఫరా చేస్తున్న సంస్థలు మాత్రం వాటికి ఏమీ పట్టనట్టు ప్రవర్తిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఆ సంస్థలను ప్రభుత్వం అంతలించకపోవడం ఏనని కొందరు చెప్పగానే చెబుతున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి