ఖాజీపేట లో నూతన కమిటీ

  జెసి న్యూస్  ఖాజీపేట మండలంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం 17 మందితో కమిటీ ఏర్పాటు చేసిన ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్.

      కాజీపేట మండలంలోని జూనియర్ కళాశాలలో మండల ప్లీనరీ సమావేశం నిర్వహించడం జరిగింది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గండి సునీల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్, సిఐటియు నాయకులు నారాయణ మాట్లాడుతూ...

      కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేషన్ విద్యా వ్యవస్థను పెంచి పోషించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయని, వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పక్క రాష్ట్రాలు ఎక్కడ కూడా అమలు చేయకున్నా మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శరవేగంగా అమలు చేస్తుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలోని పేద మధ్యతరగతి విద్యార్థులంతా విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 117 తీసుకొచ్చి పాఠశాల విలీనం పేరుతో ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి గ్రామీణ ప్రాంతాల్లో చదివేటటువంటి విద్యార్థులను విద్యకు దూరం చేయడం జరుగుతుందని వారన్నారు. జీవో నెంబర్ 77 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ విద్యాసంస్థల్లో పీజీ చదివే విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యకు దూరం చేస్తుందని వారన్నారు. జగనన్న విద్యా దీవెన వస దీవెన బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, సంక్షేమ గృహాలలో చదివే విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టులను భక్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 14వ తేదీన కడప నగరంలో నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని వారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. 

 అ


ధ్యక్షులుగా రవివర్మ, కార్యదర్శిగా దుగ్గిరెడ్డి.రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా గణేష్, సువర్మ, నరసింహ, సహాయ కార్యదర్శులుగా సి.నాగేష్, డి.రవితేజ, ఎం.చంద్ర కమిటీ సభ్యులుగా పవన్, రఫీ, సంజీవ్, భాషా, హుస్సేన్, సురేష్, యాసీన్, అఖిల్, మధులను ఎన్నుకోవడం జరిగింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి