రక్షక బట నిలయం వెళ్లాలంటే భయం ?
కాజీపేట పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా. అయితే మీరు తిరుపతికి వెళ్ళినట్టే. అంటే అంత పవిత్రమైంది అనుకుంటున్నారా అదేమీ కాదు. గుండు కొట్టి పంపిస్తారని అర్థం ఇలా జరగడంతో పెద్ద బాసులు ఒకరిని వీఆర్ కూడా పంపించడం తో ఇప్పటికైనా మిగతా పోలీసులు మేల్కొంటారా వేచి చూద్దాం. చివరికి అధికార పార్టీ నాయకులు కూడా స్టేషన్ కు రావాలంటే జంపుతున్న వైనం.
మామూళ్ల మత్తులో ఊగిసలాడుతున్న కాజీపేట పోలీస్ స్టేషన్ ఏ పనికి వచ్చినా డబ్బులు ఇవ్వకుండా జరిగే ప్రసిద్ధి లేదంటున్న ప్రజలు భారత ప్రధాని ఒక సైడు డిజిటల్ పేమెంట్లు అని చెప్పిందానికి ఇక్కడ ఏ మాత్రం తీసిపోకుండా మొత్తం డిజిటల్ పేమెంట్ లో జరుగుతుందంటే అతిశయోక్తి కాదు
ఒక సైడు గుట్కా మరో సైడు రేషన్ బియ్యం తో ప్రతిరోజు జోబి నిండకుండా ఇంటికి వెళ్లి ప్రసక్తి లేదు. దీనికి ప్రధాన కారణం స్టేషన్ ఇన్స్పెక్టర్ మంచితనమేనని అందువల్ల మిగతా కానిస్టేబుళ్లు రెచ్చిపోతున్నారని ప్రజలు మీడియాకు తెలియజేశారు స్టేషన్ కి వెళ్లాలంటే భయపడుతున్నామని కాజీపేట స్టేషన్ లో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు జరగలేదని నెత్తి నోరు కొట్టుకుంటున్న ప్రజలు
ఇవన్నీ అదును చూసుకొని దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు ప్రతినిత్యం రోజుకో బైకు కాజీపేటలో దొంగలించబడుతుందంటే ఆశ్చర్య పోవాల్సిందే. రాత్రి సమయాలలో ఉన్న డాబాల లో మొత్తం మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డాబాల దగ్గర నుంచి మామూలు తీసుకోవడంతో ఏమాత్రం లెక్కచేయకుండా మిగతా పోలీసులను మాట్లాడుతున్న యజమానులు
స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది మరో అడుగు ముందుకేసి స్టేషన్లో ఉన్న వాహనాలకు సంబంధించిన వస్తువులను రాత్రి మాయం చేసి జేబులో నింపుకుంటున్నారు వీటన్నింటికీ ఎప్పుడు చరమగీతం . పాడుతారని ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి