కాజీపేటలో ఘనంగా పోలీసుల అమర వీరుల ర్యాలీ
ఖాజీపేట లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. అందరికీ తెలిసిందే భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం స్మరించుకుంటున్నాము
కాజీపేట పోలీసులు మరియు విద్యార్థులు ఆధ్వర్యంలో ఘనంగా పోలీసుల త్యాగానికి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ కులాయప్ప సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేంద్ర రెడ్డి తో పాటు స్టూడెంట్ యూనియన్ నాయకులు రవి వర్మ తోపాటు ఉపేంద్ర మరికొందరు పాల్గొని గత చరిత్రను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు
ఈ సందర్భంగా వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి