కడప జిల్లా చాపాడు లో నలుగురు మృతి పై పలు అనుమానాలు ?

  (



జే సి ఎన్ న్యూస్  చాపాడు) మండలంలో ఒకేరోజు నలుగురు మృత్యువాత పడటం పై సర్వత్ర పలు అనుమానాలకు  రేకెత్తిస్తున్నాయి

చాపాడు మండలంలో ఒకేరోజు నలుగురు మృత్యువాత పడడంపై కుట్రకోణం దాగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పొలంలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందిన ఘటన తెలిసిన కొద్దిసేపటికి కమలాపురంలో వ్యక్తి మృతి చెందడంతో పలు అనుమానాలకు మొదలయ్యాయి ఎస్సీ కాలనీ వాసులు అందరూ మృతికి అనుమానిస్తున్న బాధితుడి ఇంటి ముందు ముందు ఆందోళన దిగడమే దీనికి ప్రధాన కారణం ఈ విషయంపై పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నడంతో పల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి

అన్నదమ్ములు బాల ఓబుల్ రెడ్డి ఓబుల్ రెడ్డి మల్లికార్జున రెడ్డి పొలాలలో పురుగుల మందు చల్లుతూ మృత్యువాతపడడంతో ఆ ప్రాంతంలో 10 మీటర్ల బైండింగ్ వైరు ఉండడము విద్యుత్తుకు అనుసంధానం చేయడం  తో అనుమానాలు బలమయ్యాయి అంతేకాకుండా ఆ తీగ ద్వారా మల్లికార్జున్ రెడ్డి  విద్యుత్ ఘాతానికి  గురి కావడం మిగతా ఇద్దరూ కాపాడబోయే మృతి చెందడంతో . విద్యుత్  గత ప్రమాదంతో మృతి చెందారని పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు అయితే కొద్దిసేపటి తర్వాత కమలాపురం వద్ద రాంబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పలు అనుమానాలు రేకెత్తించడం ఎస్సీ కాలనీ వాసులు అందరూ బాధితుడు ఇంటి ముందు ఆందోళన దిగడం అనుమానానికి బలం చేకూరాయి.

ఇదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ సుదర్శన్ రెడ్డి రాంబాబును బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లడంతో బంధువులు ఆందోళనకు దిగారు గ్రామంలో ఇంత సంఘటన జరిగితే ఇటుకల కోసం కమలాపురం  వెళ్లిన వ్యక్తి ట్రాక్టర్ నుంచి కిందపడి చనిపోయాడని సుదర్శన్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే రాంబాబు చనిపోలేదని ట్రాక్టర్ కింద దొబ్బి చంపేశారని బంధువులు ఆందోళన దిగడంతో చర్చనీయాంశమైంది మృతుడి రాంబాబు భార్య ప్రమీల నా భర్త చనిపోలేదని సుదర్శన్ రెడ్డి గొంతు నులిమి చంపేసి ప్రమాదంగా సృష్టించాడని ఆవేదన వ్యక్తం చేశారు

విషయం అతా రాంబాబుకు తెలుసు కాబట్టి అతని ద్వారా విషయం బయటకి పొక్కా కుండా ఈ ప్రయత్నం చేసి ఉంటారని చర్చలు నడుస్తున్నాయి. ప్రమాదం జరిగిన అప్పటినుంచి సుదర్శన్ రెడ్డి కనిపించకపోవడంతో పాటు గతంలో బాల ఓబుల్ రెడ్డి పొలాలలో ఉన్న గడ్డివామీ అగ్నికి ఆహుతి కావడంతో వారిద్దరి మధ్య వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది విషయం ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని కుట్ర చేశాడని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి

ఏదేమైనప్పటికీ సుదర్శన్ రెడ్డి కనిపిస్తే గాని ఈ సమస్య ఒక కొలిక్కి రాదని పోలీసులు సుదర్శన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...