మైదుకూరు లో ఇన్ని స్పీడ్ బ్రేకర్ల ?
మైదుకూరు మున్సిపాలిటీలోని సరస్వతి పేట రహదారిలో సుమారు 10 స్పీడ్ బ్రేకర్లు వేయడానికి వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు మేము యాడ చూడలేదు అంటున్నా ప్రయాణికులు.
గత కొద్ది రోజుల నుంచి ప్రమాదాలు జరుగుతుండడంతో వేశారన్న ప్రయాణికులు అయినా ఇన్ని స్పీడ్ బ్రేకర్లు అవసరం లేదు అంటున్న గ్రామస్తులు
మైదుకూరు సరస్వతి పేట నుంచి జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే స్పీడ్ బ్రేకర్లు వేయడంపై ఆర్టీసీ డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు ఒక సైడు యాజమాన్యాలు KMPL రాలేదని డ్రైవర్ల పైన అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటే డ్రైవింగ్ చేసే పరిస్థితులు లేవు అంటున్న డ్రైవర్లు
రోడ్డు అండ్ బిల్డింగ్స్ అధికారులను వివరాలను అడగగా రహదారిలో ఇన్ని స్పీడ్ బ్రేకర్లు వేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదు కొన్ని వాటిని తొలగిస్తాము తెలియజేశారు
అయితే ఇంతవరకు ఒక సమస్య ఉండగా ఇప్పుడు మరో సమస్య ప్రయాణికులకు ఎదురుకానుంది స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని గమనించక చాలామంది స్పీడ్ గా వచ్చి ఎగిరిపడి గాయాలు పాలయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్న ప్రయాణికులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి