ఖాజీపేట స్కూల్ కు 75 సంవత్సరాలు.
ఖాజీపేట
స్వాతంత్రం వచ్చిన మరుసటి సంవత్సరమే ఎందరో మహానుభావులు త్యాగఫలంతో మైదుకూరు నియోజకవర్గం లోని మొదటిసారిగా నిర్మించబడిన ఈ పాఠశాల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకసారి పాఠశాల పై లుక్కేయండి
ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థులకు ఈ పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. బ్రిటిష్ పరిపాలన పోయిన మరుసటి ఏడాదే స్థాపించడం వెనుక ఎంతమంది మహానుభావుల త్యాగబులం ఉందో ఒకసారి గుర్తు చేసుకుందాం.
ఈ పాఠశాల ప్రారంభించి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఇక్కడ చదువుకున్న ఎంతమంది విద్యార్థులు వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించి ఎందరికో ఆదర్శప్యంగా నిలిచిన ఈ పాఠశాలను ఇప్పుడు గత పాలకులకు ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధివిధానాల వల్ల ప్రైవేటు విద్యా విధానం రావడం ప్రభుత్వ పాఠశాలలపై చులకన విధానం తల్లిదండ్రులు ఏర్పడడం దానికి అనుగుణంగా ప్రభుత్వాలు పాఠశాల లను రూపొందించలేకపోవడం కొన్ని పాఠశాలలను మూసేసిన. ఈ పాఠశాల కొత్త రూపులు దిద్దుకుంటూ ఈ తరం విద్యార్థులు కూడా విద్యను అందించడం విశేషం
అయితే ఆ చదువుల తల్లికి ఇప్పుడున్న ఉపాధ్యాయులు చెదలు పట్టించారు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుని విద్యార్థులను గాలికి వదిలేసి ఇష్టానుసారుగా బాతాకాన్ని కొట్టడం . కేవలం ఐదు ఆరు వేలు జీతానికి పనిచేస్తున్న ప్రైవేట్ స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చి దిద్ది ర్యాంకుల దిశగా ప్రయత్నం చేస్తుంటే వీరు మాత్రం వచ్చామా వెళ్ళామా అని విధంగా తయారయ్యారు మళ్లీ గాంధీ మహాత్ముడే పుట్టి వచ్చిన స్కూలు పరిస్థితులు మారుతాయి అని ప్రసక్తి లేదు
గత కాలంలో వైభవంతో విద్యార్థులను తీర్చిదిద్దిన ఈ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఎందరో డాక్టర్లు రాజకీయవేత్తలు మంత్రులు రచయితలు. అయిన చరిత్ర ఉన్న ఈ స్కూలుకు మళ్ళీ పూర్వ వైభవం ఎప్పుడొస్తుందోనని ఎదురు చూద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి