ఖాజీపేట పత్తి రైతు కంట కన్నీరు

 ఖాజీపేట గత ఏడాది పత్తి రైతుల పంట ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది ఒక్క కాజీపేట మండలంలోని సుమారు 600 ఎకరాలలో పైచిలుకు పత్తి సాగు చేసే నష్టాల ఊబిలోకి కూరుకు పోయారు

గత ఏడాది పత్తి రైతులకు తగినంత ఫలితం రావడంతో అటువైపు మొగ్గు చూపిన పత్తి రైతుల ఆశ అడియాస అయింది. ప్రారంభ దశలో వర్షాలు ఎక్కువగా పడి కొందరు రైతులు రెండు మూడు సార్లు విత్తనాలు వేసిన అవి సరిగా మొలక రాకపోవడం అవి వచ్చిన వెంటనే మళ్ళీ వర్షాలు రావడం అమాంతంగా పత్తి విత్తనాలు రేట్లు పెరిగిపోవడం రైతులను తీరని నష్టాల ఊబిలోకి కూరుకు పోయారు

 గత ఏడది క్వింటాలు 12000 నుంచి 13 వేల వరకు అమ్ముడుపోగా ఈ ఏడాది 6000 కూడా అడిగే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు . పోయిన సీజన్లో  కంటే ఈ ఏడాది వ్యయం పెరిగిపోవడంతో ఎకరాకు సాగు చేయడానికి మందులు విత్తనాలకే 40000 వేలకు పై మాటే ఖర్చు వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు

ఎన్ని మందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయిందని శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని విధంగా ఈ పురుగు కాయలోని పుట్టి మొత్తం నాశనం చేస్తుందని ప్రభుత్వం ఆదుకోకపోతే పత్తి రైతుల ఆత్మహత్యలు మళ్ళీ చూడాలని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు .

వీటి పైన వ్యవసాయ అధికారిని వివరణ అడుగగా ఇప్పటికే శాస్త్రవేత్తలను నాలుగు సార్లు పిలిపించి పరిశోధన చేయించామని అయినా ఫలితం లేకుండా పోయిందని వివరించారు





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...