ఆక్రమణలు బోర్డులకే పరిమితమా ?
ఖాజీపేట గత కొద్ది కాలంగా రెవిన్యూ సమస్యలకు బోర్డులు మాత్రమే దర్శనం పరిష్కారం లేక ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. మండలంలో చాలామంది రైతులు దారి కోసం మిగతా భూ సమస్యల కోసం రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగిన వారు మాత్రం తగిన ఫలితం చూపలేక సమస్యతో వెళ్లిన రైతులకు నిరాశను గురి చేస్తున్నారు అలాంటి రైతులు నిరాశపరచకుండా బోర్డులు మాత్రమే పెట్టి చేతులు దులుపుకుంటున్నారు ఇలాంటి సన్నివేశాలు కాజీపేటలో ఊరి కోటి ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు.
కాజీపేట మండలంలోని పలు గ్రామపంచాయతీలలో రైతుల వెళ్ళటానికి చాలా సంవత్సరాల నుంచి రహదారులు ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగా రోడ్లను ఆక్రమణ చేయడం ఒక తీరైతే మిగతావారు పూర్తిగా రోడ్డు లేకుండా ఆక్రమణ చేయడం కొత్తేమీ కాదు. అయితే సమస్య పరిష్కారం కోసం రెవిన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన ఫలితం లేదు తాజాగా రెవిన్యూ అధికారులు బోర్డులు పెట్టి నా వారు ఏమాత్రం లెక్కచేయకుండా ఆక్రమణలు తొలగించుకోకపోవడంతో ఆ దారిన వెళ్లే రైతులకు ఇబ్బందిగా తయారు కావడం వాటిని సరి చేయడంలో రెవెన్యూ అధికారులు విఫలం కావడం సర్వసాధారణం అయిపోయింది . తాజాగా రావులపల్లె పంచాయతీలోని చాలా సంవత్సరాల నుంచి మనుగడలో ఉన్న రహదారిని ఆక్రమణ చేయడం వాటికి బోర్డు పెట్టిన ఏమాత్రం లెక్కచేయకుండా రైతులు వ్యవహరించడం దాని సరి చేయకపోవడం రెవిన్యూ అధికారులు తీరుపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి
మండలంలో చాలా చోట్ల ఆక్రమణలకు ప్రభుత్వ భూములు డీకే డిబ్బులు గురి అయిన అవి బోర్డు పెట్టి రెవిన్యూ అధికారులు చేతులు తెలుపుకుంటున్నారే తప్ప పరిష్కార దిశగా ప్రయత్నం చేయలేదని అధికార పార్టీ నాయకులు కొమ్ముకాస్తున్నారని కొందరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి