అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా.




 ఖాజీపేట ప్రాంతంలో బ్రిటిష్ కాలం నాటి పిడబ్ల్యుడి నిర్మించి ఇక్కడనుండి కేసి కెనాల్ కాలువ సంబంధించిన అధికారుల వసతి గృహంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బంగ్లాను ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మరి ఇష్టానుసారంగా ఆక్రమణకు గురి కావడం అధికారులను కలిసి వేసింది

మందుబాబులు నూతనంగా నిర్మించిన బంగ్లా పైన కూడా ఇష్టానుసారంగా రాత్రి సమయాల్లో మద్యం సేవించి ఆ వస్తువులను దూరంగా కూడా పడి వేయకుండా అక్కడే ఉంచడం తోపాటు పాత బంగ్లా చుట్టుపక్కల ఎక్కడ చూసినా బీరు మందు బాటిల్ తప్ప మరొకటి కనిపించడం లేదు అంతేకాకుండా గతంలో ఈ బంగ్లాను 15వ పోలింగ్ బూత్ గా గత కొద్దికాలంగా ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే చుట్టుపక్కల నివసిస్తున్న వారు ప్రహరీ గోడలను కూడా ధ్వంసం చేసి ఇష్టానుసారంగా ఆక్రమణకు గురైంది అంతేకాకుండా రహదారులను ఏర్పాటు చేసి అక్కడే దారిని ఏర్పాటు చేసుకుని రహదారిగా మార్చారు  ఈ విషయంపై గతంలో కొందరు స్థానికుల అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం ఎలాంటి స్పందన లేదు.

 ఈ విషయంపై కేసీ కెనాల్ అధికారులను వివరణ అడగ్గా త్వరలో ఆ దారిన ఎవరు వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...