పుష్పగిరిలో గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు సుగుమం
జె సి న్ న్యూస్ (చంద్ర రెడ్డి) దక్షిణ కాశీగా పేరు పొందిన మహిమాన్విత దేవాలయమైన వైద్యనాధేశ్వర కాశీశ్వర దేవాలయ మూర్తుల కలయికతో ఏర్పడ్డ ఈ దక్షిణ కాశీని మార్చి 1వ తేదీ ఉదయం ఏడు గంటలకు గిరి ప్రదర్శన కోసం శంకుస్థాపన చేయనున్న పుష్పగిరి పీఠాధిపతి.
పుష్పగిరి గట్టుకు విశిష్టత కలిగిన ఆనవాళ్లు ఉన్నాయి అవి తెలియని విషయం ఏమిటంటే గట్టు పాదము రూపంలో ఉండడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లో మహిమాన్వితమైన దేవాలయాల్లో పుష్పగిరి దేవాలయం ఒకటి త్వరలో భక్తులకు గిరిప్రదక్షిణ కోసం పుష్పగిరి గట్టు చుట్టూ రోడ్డు నిర్మాణం . ఏర్పాటు చేయనున్నారు ఇందులో భాగంగా మార్చి ఒకటో తేదీ నుంచి శంకుస్థాపన చేసి త్వరలో కొండ చుట్టూ ప్రాంతం రోడ్డుని ఏర్పాటు చేసి గిరి ప్రదర్శనకు ఏర్పాట్లు చేయనున్నారు
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి .ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు.
ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.
పుష్పగిరి దేవాలయం
తెలుగులో తొలి యాత్రాచరిత్రగా చెప్పబడే కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో ఈ గ్రామంలో 1830 సంవత్సరాంతంలో విడిది చేశారు. ఆ సమయంలో తాను గమనించి గ్రామవిశేషాలను గ్రంథంలో చేర్చుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి