ఖాజీపేట లో సబ్ స్టేషన్ కు శంకుస్థాపన.


ఖాజీపేట( చంద్ర రెడ్డి జె సి న్ న్యూస్ )రోజురోజుకు పెరిగిపోతున్న విద్యుత్ అవసరాల కోసం మండలంలో ఇప్పటివరకు ఉన్న ఐదు సబ్ స్టేషన్ తో పాటు మరో నూతన సబ్ స్టేషన్ ను  కూనవారిపల్లి గ్రామంలో నూతన 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామి రెడ్డి గారు భూమిపూజ నిర్వహించారు. 

వోల్టేజి సమస్యని నివారించేటందుకు  రైతులకు నిర్విరామంగా 9 గంటల నాణ్యమైన విద్యుత్ ని అందించాలన్న ధ్యేయంతో ప్రభుత్వం నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో శాసనసభ్యులు నూతన సబ్ స్టేషన్ శంకుస్థాపన చేశారు. త్వరితగతిన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని  త్వరితగతిన పూర్తిచేసి సకాలంలో అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్ మూలె భరత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో APIIC  డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి, ఖాజీపేట యం.పి.పి అబూ బకార్ సిద్దిఖ్  , సొసైటీ చైర్మన్  రాఘవరెడ్డి , కూనవారిపల్లి సర్పంచ్ సుబ్బారెడ్డి మరియు స్థానిక వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...