చదువులు చెప్పడంలో త్రిలోదకాలు


       ప్రైవేటు విద్యాసంస్థలలో కనీస సౌకర్యాలు లేక           విద్యార్థులు అవస్థలు.

విద్యార్థుల నుంచి వేలకు వేలు డబ్బులు తీసుకుంటు ఎలాంటి విద్యార్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన.

కార్పొరేట్ స్కూల్ కూడా అదే బాటలో 

చోద్యం చూస్తున్న విద్యాశాఖ.

రెండు రేకులు నాలుగు సిమెంట్ దిమ్మెలతో రూములు ఏర్పాటు

అలా నిర్మిస్తే అనుమతులు ఎలా ఇస్తారు అంటున్న విద్యార్థి సంఘాలు

విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ తరహా చట్టం చాలా మంచిదని, అందువల్ల ఈ చట్టాన్ని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఖచ్చితంగా అమలు చేసి తీరాలంటూ సుప్రీం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో దేశంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు పేద విద్యార్థులకు తమ సీట్లలో 25 శాతం ఖచ్చితంగా కేటాయించాల్సి ఉంది.   ప్రైవేటు స్కూల్లో యాజమాన్యాలు వేలకు వేలు డబ్బులు తీసుకొని. పిల్లల చదువులను గాలికి వదిలేస్తున్నారు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు వీధికి ఒకటి ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను చదువులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే స్కూల్లో ఉండవలసిన కనీస సౌకర్యాలు లేకుండా . రెండు రేకులు వేసి నాలుగు సిమెంట్ దిమ్మెలు పెట్టి  స్కూలుగా రూపకల్పన చేసి పశువులకు వేసే పశువుల పాక మాదిరి మారాయని విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి   విద్యార్థులను  అందులో పెట్టి చదువులు చెప్పడంతో వారి జీవితం టెన్త్ క్లాస్ వరకే చదివి ఉన్నత విద్యల కోసం ఎక్కడికెళ్లాల్లో ఆలోచనలో పడ్డ తల్లిదండ్రులు చదువుకునే పరిస్థితి పోయి తల్లిదండ్రులకు చదువు కొనే పరిస్థితి తలైతుందని. వేలకు వేలు డబ్బులు తీసుకొని టీచర్లను మాత్రం 10వ తరగతి కూడా పాస్ గారిని వారి చేత విద్యాబోధన చేయించడం  తల్లిదండ్రులకు మింగుడు పడడం లేదు.

విద్యాసంస్థల్లో కనీస సౌకర్యాలు ఆట స్థలాలు  ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ధనర్జీనే  ధ్యేయంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా దోచుకుంటున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ప్రైవేటు స్కూల్లో కొత్త వాటిని నెల కల్పకుండా చూడాలని. ప్రభుత్వం వేలకు వేలు ఖర్చుపెట్టి ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కింద రూపకల్పన చేస్తు. ప్రైవేటు పాఠశాలలకు కొత్త వాటికి ఎందుకు అనుమతిస్తున్నారని విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న లెక్క చేయని ప్రభుత్వాలు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...