మైదుకూరు పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్లు.
మైదుకూరు నియోజకవర్గం వ్యాప్తిగా 147 మినరల్ వాటర్ ప్లాంట్లు. వీధికొకటి పుట్టుకొస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ప్లాంట్ నిర్వహణ దారులు చోద్యం చూస్తున్న అధికారులు
ప్రస్తుతం ఎక్కడ చూసినా మినరల్ వాటర్ ప్లాంట్ హవా నడుస్తుంది ప్రతి ఒక్కరు వాటర్ క్యాన్లు లో తాగునీరు కొనుక్కో అని తాగాల్సిన పరిస్థితి వచ్చింది పట్టణాలతో పాటు పల్లెల్లో ఇదే పద్ధతి కొనసాగుతుంది. మినరల్ వాటర్ ఆల్కలైన్ వాటర్ ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ అని అంటూ వాటర్ ప్లాంట్ నిర్వహణదారులు ప్రతిరోజు వేళల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు కానీ వాళ్ళ అమ్మేది నిజమైన మినరల్ వాటర్ లేనా? అంటే డౌటే సాధన నీరు నింపి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కొందరైతే. చేస్తూ ప్రజలను ఆరోగ్యం కంటే వారి లాభార్జన దేంగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు
వ్యాపారస్తులు ఆలోచనలు కూడా రోజురోజుకు మారుతున్న పరిస్థితులలో ఏది త్వరగా పెట్టుబడులు వస్తాయో దాని ఆలోచించి ఆ దిశగా దూసుకుపోతున్నారు. అలాంటి వ్యాపారాలలో వేగంగా పెట్టుబడులు రావడనికి దోహదం చేస్తున్న వ్యాపారం మినరల్ వాటర్. దానికి ప్రజలు కూడా అలవాటు కావడంతో వారి పంట పండింది. ఏమాత్రం నియమ నిబంధనలు లేకుండా ఇష్టానుసారంగ క్లోరినేషన్ చేయడంతో 60 సంవత్సరాలు స్వేచ్ఛగా జీవించాల్సిన వ్యక్తులు 40 సంవత్సరాలకే వివిధ వ్యాధులతో నడవలేని స్థితిలో ఉన్నారంటే ఆశ్చర్యం లేదు దానికి ప్రధాన కారణం డాక్టర్లు చూసిస్తున్న సలహాలు ప్రభుత్వ గణంకాలు తెలియజేస్తున్నాయి.
రోజుకోటి పుట్టుకొస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ తో ప్రశ్నార్ధకంగా మారిన ప్రజల జీవితాలు వాటి పైన దృష్టి సారించాల్సిన రెవిన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో దానికి అలవాటు పడ్డ ప్రజలు కిలోమీటర్లు దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది
ఒక్క కాజీపేట లో సుమారు మండల వ్యాప్తంగా 30 వాటర్ ప్లాంట్ లు ఉన్నాయంటే వారి వ్యాపారం ఎలా ఉందో ఆలోచించుకోవచ్చు ఇప్పుడైనా రెవెన్యూ అధికారులు వాటిని నిరసిస్తున్న వాటిపై దృష్టి సాధించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని వెంటనే తొలగించి ఆరోగ్యాలను కాపాడాలని కోరుకుంటున్నా ప్రజలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి