పెన్నా నదిలో ఇసుక త్రవ్వకాలు
ఖాజీపేట పెన్నా నది పరివాహక ప్రాంతాలలో నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఏ పంటలు వేయడానికైనా వెనుకాడని ప్రజలు. అక్రమ ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న పెన్నా నది పరివాహక రైతులు.
కుందు మరియు పెన్నా నది పరివాహక ప్రాంతాలలో ప్రభుత్వం ఇసుకలీజుదారులు పరిమితికి మించి ఇష్టానుసారంగా తవ్వకాలు చేయడంతో సమీపంలోని రైతులకు సంబంధించిన వ్యవసాయ బోరు పూర్తిగా ఇప్పటికే ఎండిపోయే మరోసారి బోరు వేసుకునే ప్రయత్నం చేస్తున్న రైతులందరికీ తలనొప్పిగా తయారైంది.
ఇదంతా ఒక ఎత్తైతే పెన్నా నది సమీపంలో నీ ములపాక గ్రామం నుండి గత కాంగ్రెస్ ప్రభుత్వం వేసవిలో నీటి ఎద్దడి రాకూడదని ఉద్దేశంతో కాజీపేట మరియు మైదుకూరు ప్రాంత ప్రజలకు నీటి సమస్య తీర్చడానికి సుమారు లక్షల 50 కోట్ల రూపాయలతో మునిపాక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి. మైదుకూరు వరకు సుమారు 80 గ్రామాలకు నీటి సరఫరా చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పథకానికి ఈ ఇసుక రవాణా చేయడంతో. ప్రజలకు నీటి సమస్య ఏర్పడుతుందని ప్రభుత్వం ఆలోచించకుండానే సమీపంలోని లీజు దారులకు ఇసుక రవాణా తరలింపుకు పరిమితి ఇవ్వడంతో వచ్చే ఏడాది వేసవి సమయానికి బోర్లు పూర్తిగా ఎండిపోతాయని సమీప గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మైన్స్ అధికారులు మాత్రం ఒక విధంగా చెబుతుంటే ఇసుక రవాణా దారులు మాత్రం అధికారులు ఏమాత్రం లెక్కచేయకుండా ఇష్టానుసారంగా లోతు తవ్వడంతో సమీప గ్రామాల ప్రజలకు నీతి ఎద్దడి ఏర్పడే పరిస్థితి వస్తుందని. చెప్పిన చట్ట ప్రకారము కేవలం రెండు మీట్లే తవ్వాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేసిన ఏ మాత్రం లెక్కచేయకుండా ఏడు నుంచి ఎనిమిది మీటర్ల లోపలికి తవ్వి భూగ్రభజలాలను నాశనం చేస్తున్నారని ప్రతిపక్షమైన టిడిపి సమీప ప్రాంతాన్ని దర్శించి ఆందోళన చేసిన లెక్కచేయకుండా తరలిస్తున్నారని టిడిపి నాయకుడు గగ్గోలు పెడుతున్నారు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా ఇష్టానుసారంగా తవ్వకాలను జరపకుండా నిలుపుదల చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి