కడప ఉక్కు ఫ్యాక్టరీ వెంటనే చేపట్టాలి.
కడపలో ఉక్కు ప్యాక్టరీ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి.SFI
విభజన హక్కు చట్టం హామీ మేరకు కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కునిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నేటికి 7 సంవత్సరాలు కావొస్తున్న శిలఫలకాలకే పరిమితం తప్ప నిర్మాణానికి నోచుకోలేదని వారు వాపోయారు.
ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా లక్ష ఉద్యోగాలు పరోక్షంగా లక్ష 50 వేలు ఉద్యోగ అవకాశాలు వస్తున్న ప్రభుత్వాలు ముందడుగు వేయకపోవడం దారుణం అని వారు అన్నారు .రాష్ట్రంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతం కడప ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఇతర ప్రాంతలకు వలసవెళ్లి అక్కడ బానిసలు లాగా బతుకుతున్నారని. ఈ నేపథ్యంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి. నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలకు ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఒక సంజీవని అని వారు అన్నారు.
ఓట్లు ముందు నిరుద్యోగులు కనిపిస్తారా, తరువాత నిరుద్యోగులు కనిపించరా అని వారు దుయ్యబట్టారు. కావున ఉక్కు ఫ్యాక్టరీ పనులను వెంటనే చేపట్టాలని లేనిపక్షంలో అన్ని విద్యార్థి, యువజన సంఘాలతో కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో లో *ఎస్.ఎఫ్.ఐ మండలం అధ్యక్షుడు రవి వర్మ, ఎస్ ఎఫ్ ఐ నాయకులు నవీన్ కుమార్, సాంబశివ తదితరులు* పాల్గొన్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి