ఏపీ ఫైబర్ లో డైరెక్టర్ రిలీజ్ అయ్యే పనేనా ?



 ( స్టోరీ బై చంద్రారెడ్డి )ఏపీ ఫైబర్ లో ఓటీటిలో కొత్త సినిమా థియేటర్ లతోపాటు ఓటిటి  రిలీజ్ విజయవంతం అవుతుందా? ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ని తమ వైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇక తెలుగు సినిమా హైదరాబాద్ లో పూర్తిగా సెటిల్ అయింది. దాంతో ఇప్పట్లో ఏపీ వైపు చూడడం కష్టతరమైన పరిస్థితులలో. టాలీవుడ్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే మన కూడా సాధించలేకపోవడంతో.

ఆ విషయం అలా ఉంచితే తాజాగా ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ద్వారా టాలీవుడ్ కి చెందిన సినిమాలు డైరెక్ట్ గా రిలీజ్ చేసేలా కొత్త ప్లాన్ ని సిద్ధం చేశారు. అంటే సినిమా నేరుగా ధియేటర్లలో కాకుండా ఫైబర్ నెట్ ద్వారా రిలీజ్ అన్న మాట. నిజానికి ఇది అయ్యే పనేలా అన్నదే డౌట్ గా ఉంది.

హైదరాబాద్ జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ద్వారా డైరెక్ట్ మూవీ రిలీజ్ అంటూ ఒక వినూత్న ప్రయత్నాన్ని ఆవిష్కరించారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గౌతం రెడ్డి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కారోపోరేషన్ చైర్మన్ పోసాని క్రిష్ణ మురళీ మీడియా అడ్వైజర్ అలీ ప్రముఖ సినీ నిర్మాత సి కళ్యాణ్ వంటి వారు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఏపీలోని  రోజు రోజుకు తగ్గిపోతున్న కనెక్షన్లు దానికి అనుగుణంగా సెటప్ బాక్స్ లు సరఫరా చేయలేని ప్రభుత్వం ఉన్న ఇది సాధ్యమవుతుందా అన్న ఆలోచన కూడా తలెత్తుతుంది. పేద వర్గాలకు నేరుగా వినోదాన్ని అందించడమే ఏపీ ఫైబర్ నెట్ లక్ష్యమని వారు పేర్కొన్నారు. థియేటర్ కి ఎంతో ఖర్చు పెట్టి వెళ్లలేని సామాన్యులకు నేరుగా ఇంటి వద్దనే సినిమాను అందించడం . అదే సమయంలో నేరుగా సినిమాలు రిలీజ్ చేసుకోలేని చిన్న నిర్మాతలకు ఇది ఉపకరిస్తుందని కూడా అంటున్నారు

అయితే ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక సినిమా ముందుగా థియేటర్లకే వెళ్లాలని ప్రతీ నిర్మాత చూస్తాడు. దాని వెనక డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కూడా ఉంటారు. ఒక పెద్ద వ్యవస్థ సినిమా రిలీజ్ తో సంబంధం కలిగినది ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి నేరుగా  ఫైబర్ నెట్ కి ఇచ్చేయడం అంటే మిగిలిన వారు ఎందుకు ఊరుకుంటారు అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరో వైపు చూస్తే ఇప్పటికే పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ ముందు థియేటర్లలో రిలీజ్ చేసిన తరువాత నెల రోజుల గ్యాప్ లో ఓటీటీలకు మంచి అగ్రిమెంట్ తోనే ఇచ్చుకుంటున్నారు. ఇది నిర్మాతకు అదనపు ఆదాయంగా కూడా ఉంది. ఇంత మంచి ఫెసిలిటీని వదులుకుని ఏపీ ఫైబర్ నెట్ కి నేరుగా రిలీజ్ కి ఇచ్చేసే నిర్మాతలు ఉంటారా అన్నదే పెద్ద ప్రశ్న. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే నష్టాలు ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ఫైబర్ చిన్న సినిమాలు కొన్ని ఓటీడీలో రిలీజ్ చేసే ఆర్థిక స్తోమత తమలో ఉందా అనే సమస్య కూడా తలెత్తుతుంది.

ఇక పోసాని క్రిష్ణ మురళి లాంటి వారు అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాను కూడా నేరుగా ఏపీ ఫైబర్ నెట్ కి ఇచ్చి డైరెక్ట్ రిలీజ్ చేయమంటున్నారు. అది అసలు అయ్యే పనేనా అన్నది అంతా అంటున్న మాట. అయితే ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ లాంటి వారు అయితే వయా మీడియాగా మాట్లాడుతున్నారు. చిన్న సినిమాలను ఏపీ ఫైబర్ నెట్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ చేసుకునేలా చూస్తే మంచిదే అన్నది ఆయన ఆలోచన.

అంటే ఓటీటీ పలకని థియేటర్లకు చేరని చిన్న సినిమాలు అన్న మాట. అలా ఎవరికీ మెప్పించని సినిమాలు నేరుగా ఏపీ ఫైబర్ నెట్ కి వచ్చినా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ మాత్రం వినోదం టీవీలలోనే ప్రజలకు దొరుకుతోంది. సినిమా అన్న పేరు చెప్పి కంటెంట్ లేని నాసిరకం మూవీస్ కాని మూవీస్ వస్తున్నాయి. అలాంటివి ఫైబర్ నెట్ లో వచ్చినా చూసే జనాలు ఎవరు ఉన్నారు.అయినా ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ పెద్దగా వర్కౌట్ అయ్యేది లేదనే అంటున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...