మైదుకూరు లో శిధిల వ్యవస్థలో విద్యుత్ స్తంభాలు





 మైదుకూరు గత 30 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘాల తోనే కాలం గడుపుతున్న విద్యుత్ అధికారులు కాలానుగుణంగా మార్పులు చేయకుండా పాత స్తంభాలు శిథిల వ్వస్థకు చేరుకున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చలగాటం మడుతున్న అధికారులను వెంటనే స్తంభాలు మార్చాలని.

 మైదుకూరు పట్టణంలో రోజుకు వేలాదిమంది తిరిగే ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మెయిన్ రోడ్ లో మేధా కాలేజ్ మోటును ఒకటి, అలాగే పక్క వీధి మోటున ఒక స్తంభం దెబ్బతిని ఉందని వాటి స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ అన్నారు.

         దాదాపు 30 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఇనుప, అలాగే సిమెంట్ స్తంభాల స్థానంలో నూతనంగా సిమెంట్ స్తంభాలు వెంటనే ఏర్పాటు చేసి మైదుకూరు పట్టణంలో తిరిగే ప్రజల మరియు జంతువుల ప్రాణాలను కాపాడాలని ఈరోజు మైదుకూరు పట్టణంలోని పట్టణ ప్రధాన విద్యుత్ అధికారి ఏఈ రాంబద్రయ్య గారికి రైతు సేవా సమితి మైదుకూరు పట్టణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. విద్యుత్ అధికారులు స్పందించకపోతే దశల వారి ఆందోళనకు సిద్ధమైతామని కూడా వారు అధికారులకు తెలియజేయడం జరిగింది. రైతు సేవా సమితి వైయస్సార్ కడప జిల్లా అధ్యక్షులు. ఏవీ రమణ అలాగే సమితి మైదుకూరు పట్టణ కార్యదర్శి. డి రాజా. మైదుకూరు పట్టణవాసి ధనపాల్ యుగేందర్, మరియు ప్రజా పక్షం కన్వీనర్. గోశెట్టి వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...