ఖాజీపేట

 ఖాజీపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పౌష్టికాహార లోపంతో ఏ పిల్లలు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీల పైన ప్రత్యేక దృష్టి సాధించి ఏమాత్రం లోటు రాకుండా అన్ని ఆహార పదార్థాలు అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటన నీ పక్కన పెట్టి ఇష్టానుసారంగా అంగన్వాడి సిబ్బంది వారికి మద్దతు పలుకుతున్న ఐసిడిఎస్ అధికారులు.

వివరాలు కెళ్తే కాజీపేట మండలంలో సుమారు 88 అంగన్వాడీ సెంటర్లు ఉండగా కేవలం 15 మాత్రమే ప్రతిరోజు పిల్లలతో మమేకమై వారికి తగిన పోషకాలు అందిస్తున్నాయి.  మిగతా ఏ అంగన్వాడి సెంటర్ కూడా సరిగా తెరవకపోవడం ఒక ఎత్తైతే తెరిచిన కూడా పిల్లలను ఎవర్ని సెంటర్కు తరలించకుండా వారికి తగిన పౌష్టికాహారం అందించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు  అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి.

ఏకంగా కొన్ని సెంటర్లలో 12 గంటలకు కూడా తెరవని పరిస్థితి  మరికొన్న సెంటర్లలో పనిచేస్తున్న ఆయా కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఒకరి మీద ఒకరు కొన్ని సెంటర్లలో ఒకరికి ఒకరు సరిపోకపోవడంతో  విద్యార్థులను తల్లిదండ్రులే సెంటర్ కు తీసుకువచ్చి వదిలి పెడుతున్నారు. మరికొందరు పార్టీ నాయకులు అండదండలతో అంగన్వాడి రాకుండానే చక్రం తిప్పుతున్నారు. ఒకప్పుడు అధికారులు చాలా దూరంలో ఉండి రాలేకపోయినా అలాంటి పరిస్థితి లేదు కూత వేటు దూరంలోనే నలుగురు అధికారులు ఉన్న అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు వత్తాసు పలకడం విశేషం.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...