రాత్రులు బస్సులు రాక ఇక్కట్లు
ఖాజీపేట మండల ప్రధాన కేంద్రమైన రాత్రి సమయాలలో 7 గంటల దాటితే బస్సులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు లోనికి ఆర్టిసి బస్సులు రావాలని ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయి పల్లె మల్లికార్జున్ రెడ్డి కి మండల ఎస్ఎఫ్ఐ మండలం కార్యదర్శి దుగ్గిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వినతి పత్రం
అనంతరం ఆయన మాట్లాడుతూ సాయంత్రం దాటితే చాలు ఆర్టీసీ బస్సులు కాజీపేట టౌన్ లోకి రాకుండా బైపాస్ లో వెళ్తున్నాయని అలా వెళ్లడం వల్ల మండలంలోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
కడప,మైదుకూరు,ప్రొద్దుటూరు పట్టణాలకు వెళ్లి తిరిగి ప్రజలు కాజీపేటకి రాత్రి సమయంలో రావాలంటే దాదాపు 2నుండి 3కిలోమీటర్ల వెళ్లాల్సి బస్సులు ఎక్కడం కానీ తిరిగి రావడం కానీ పరిస్థితి ఉందని .
కాజీపేటలో స్టాపింగ్ ఉండే బస్సులు కూడా కాజీపేట టౌన్ లోకి రాకుండా బైపాస్ లో వెళ్తున్నాయని అంతేకాక రాత్రి సమయంలో మైదుకూరు టికెట్ తీసుకొని కాజీపేట బైపాస్ లో బస్సులు దిగాల్సి వస్తుంది కావున మైదుకూరు,ప్రొద్దుటూరు,జమ్మలమడుగు డిపోలకు చెందిన బస్సులకు మా మండలంలో స్టాపింగ్ పాయింట్ ఏర్పాటు చేసి ప్రజలకు అదనపు చార్జీలు భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయి పల్లె మల్లికార్జున్ రెడ్డి కోరారు.
అనంతరం ఆయన స్పందిస్తూ వెంటనే ఏర్పాటు చేస్తామని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విగ్నేష్ , నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి