కడప ఖాజీపేట జాతీయ రహదారి లో దుర్గంధంతో అవస్థలు




 ఖాజీపేట నుండి కడపకు వెళ్లి జాతీయ రహదారి ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు వాహనాలలో కడపకు వెళ్లే ప్రయాణికులు  రావులపల్లె చెరువు సమీపిస్తే దుర్గంధంతో ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రధాన కారణం కాజీపేటలో చికెన్ సెంటర్ వ్యాపారస్తులు కోళ్ల వ్యర్ధాలను తీసుకెళ్లి అక్కడ పడేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది

రావులపల్లి చెరువులో లక్షలు పెట్టి చేపలు పెంచుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ వ్యాపారస్తులు ఈ వ్యర్థాలను నీటిలో పాడవేయడం వల్ల చేపలు చనిపోవడంతో పాటు నీటిని కలుషితం చేస్తున్నారు 

ఇదంతా ఒక ఎత్తైతే దారిలో వెళ్లే ప్రయాణికులు కోడి ఈకలు వాటి వ్యర్థాల వల్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు జాతీయ రహదారి నిర్వహణ చేస్తున్న వారు సమీపంలో ఉన్న వీటిని పడేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం

కోడి వ్యర్థాలను పడవేసేవారు ఇప్పటికైనా సహృదయంతో జనావాస ప్రాంతాలకు దూరంగా పడవేసి ప్రజలకు మరియు ప్రయాణికులకు మేలు చేసిన వారు తనని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి