పుష్పగిరి ఘనంగా గుడి ప్రారంభోత్సవం
తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదర్శన కోసం ఎంత ప్రసిద్ధి పొందిందో పుష్పగిరి కూడా గతంలో అలాంటి వైభవతో విరాజిల్లిన విషయం కొన్ని శాసనాల వల్ల బయటపడింది
అయితే గత కొద్ది కాలంగా ప్రధాన గుడి సమీపంలో ఉన్న గుడిలన్నీ శిధిల వ్యవస్థకు చేరుకోవడం వాటిని పునర్మించే దిశగా అడుగులేసిన శ్రీరామ రాజ్యం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పుష్పాచల ఆలయానికి పూర్వ వైభవం తేవడానికి ముందుకొచ్చిన ఈ సంస్థ తన స్థాయి శక్తుల నిర్మాణానికి అడుగులు వేస్తున్న సందర్భంలో కొందరు ఆ సంస్థను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు
శ్రీరామరాజ్యం చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూన్ 16వ తేదీ గుడి ప్రారంభోత్సవం సందర్భంగా చుట్టుపక్క గ్రామాల ప్రజలకు అన్నదానం నిర్వహించడంతోపాటు . ఈ సంస్థ మునుముందు భక్తులతో మమేకమై ప్రధాన ఆలయాన్ని త్వరలో విగ్రహ ప్రతిష్ట గావించనున్న సందర్భంలో ఈ సంస్థ గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ముందుకు వెళ్తున్నారు
జేష్ఠ బహుళ చతుర్థి జూన్ 16వ తేదీ శుక్రవారం 9 గంటల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాస శివరాత్రి పురస్కరించుకొని ప్రధాన అర్చకులు చేత మహా రుద్రాభిషేకం గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు . రోజురోజుకు పెరుగుతున్న భక్తి భావాలే ఈ ఆలయాల నిర్మాణానికి రూపకల్పన గావించబడిందని ట్రస్ట్ అధ్యక్షుడు అండ కొండ రాముడు తెలియజేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి