బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్లో విద్యార్థి మృతి
విద్యార్థుల పాలిట శాపంగా మారిన ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు
ఎవరైనా విద్యార్థి సంఘాలు వచ్చి విద్యార్థులు సమస్య పైన పోరాటం చేద్దామనుకున్నా నేను కూడా ఒకప్పుడు సంఘాలలో పాల్గొన్న వాణ్ణి అని కథలు చెప్పే వారిని పంపించే ప్రయత్నం చేసేవాడు
బీరం సుబ్బారెడ్డి కి ఇద్దరు భార్యలు ఇద్దరు కుమారులు కాగా మొదటి కుమారుడు చనిపోవడంతోనే ఈ ట్రస్టుకు రూపకల్పన జరిగింది రెండో కుమారుడు శ్రీకాంత్ రెడ్డి సోలు వ్యవహారాలు తో పాటు ఈ మధ్యన ఆర్డిఓ గా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో స్కూల్ వ్యవహారాలు నిర్వహిస్తున్నాడు గతంలో ఒకసారి రాయలసీమ పట్టబద్దల స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర కూడా ఉంది
బీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభంలో ప్రతి విద్యార్థికి విద్య అందించడంలో ముందుండి విద్యార్థులు తీర్చిదిద్దుతామని చెప్పుకొని వచ్చిన ఈ ట్రస్టు. ప్రారంభమైన ఈ సంస్థ అంచలంచలుగా ఎదిగి ట్రస్ట్ కార్పొరేటర్ సంస్థగా అవతారం ఎత్తిన యజమాని సుబ్బారెడ్డి ఎవరిని లెక్క చేయని విధంగా నియంతగా వ్యవహరిస్తున్నాడని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీసం విద్యాసంఘాలను కూడా లోపలికి రాణించే ప్రసక్తి లేదని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి
ఇదంతా ఒక ఎత్తైతే విద్యాసంస్థల ప్రారంభించే సమయంలో చుట్టుపక్కల భూమి యజమానులతో సయోధ్య గా ఉండి వాళ్లపైనే కేసులు బనాయించే స్థితికి వెళ్ళాడు పెట్టించాడని సమీప గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయగా సమీపంలోని భూములను అందర్నీ బెదిరించి కొనే ప్రయత్నం చేశాడని అందులో భాగంగానే 52 ఎకరాలకు నీరు పాడిదలు చేస్తున్న కేసీ కెనాల్ ను కూడా ఇష్టం వచ్చిన లైనింగ్ పగలగొట్టి స్కూల్ లో నుంచి వచ్చే మురికి ఆ కాలువలోకి మళ్లించాలని ప్రయత్నం చేయడంతో తీవ్రంగా వ్యతిరేకించిన గ్రామస్తులు ధర్నా కూడా దిగడం ప్రారంభం నుంచి వివాదాలతో నెలకొన్నయి స్కూల్ ఎవరికి కొరగాని కోయగా మారాడు అంటే అతిశయోక్తి లేదు
సమీప గ్రామాల విద్యార్థులు యోని చేర్చుకోకుండా దూరప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వడం ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం ఏ కార్పొరేట్ స్కూల్లో లేని విధంగా వసూలు చేయడంపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి
సీబీఎస్ఈ పేరుతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం ఒక ఎత్తైతే సెంట్రల్ సిలబస్ లో ఏ తరగతికి కూడా 2500 నుంచి బుక్కులు లేకపోవడం ఆ బుక్ ల కోసం సుమారు పదివేల వరకు వసూలు చేయడం విశేషం
నిన్న ఉదయం 6 గంటల సమీపంలో కాజీపేట మండలం బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ లో జరిగిన ఘటన విద్యార్థులతోపాటు తల్లిదండ్రులను కూడా కలిసి వేసిన ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు భావేద్యానికి లోనైన తల్లిదండ్రులు ఒక్కసారిగా విద్య సంస్థ పైన విరుచుకుపడ్డారు
వివరాల్లోకి వెళ్తే ఉదయం 6 గంటల సమయంలో ఆరో తరగతి చదువుతున్న సోహిత్ అనే విద్యార్థి కడుపు నొప్పితో బాధపడుతున్నాడని తల్లిదండ్రులకు ఫోన్ చేసిన వార్డెన్ తర్వాత కొద్ది నిమిషాలకే తల్లిదండ్రులు బంధువుల్ని అక్కడికి పంపించడంతో అక్కడి నుంచి చెన్నూరు ఆసుపత్రికి తరలించారు అక్కడినుంచి ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన వెంటనే కొద్ది నిమిషాలకే చనిపోయాడని వైద్యులు నిర్ధారణ చేయడంతో ఒక్కసారి ఆవేదన చెందిన బంధువులు విద్యార్థి మృతదేహంతో స్కూల్లో వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు
విద్యా సంస్థకు సంబంధించిన ఎవరు ఈ సంఘటన పైన ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఆవేదన చెందిన బంధువులు మృతదేహంతో కూలీదుట ధర్నా నిర్వహించగా విద్యార్థులు తల్లిదండ్రులతోపాటు విద్యార్థి సంఘాలు ధర్నాలో పాల్గొనడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది
గత 20 రోజుల క్రితం ఆరో తరగతి విద్యార్థిగా బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్లో చేరిన రోహిత్ మృతి చెందడంతో లక్షల రూపాయల్లో డబ్బులు తీసుకుని విద్యార్థుల పట్ల ఏమాత్రం ఆలోచించకుండా నిర్ధాక్షణంగా కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
విద్యార్థి మృతి చెందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచక్షణ రహితంగా అక్కడ ఉన్నవారిని పైన లాఠీచార్టీ చేయడంతో కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు పోలీసుల పైన విద్యాసంస్థ పైన మండిపడుతున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి