పాఠశాలల బంద్ విజయవంతం

 బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థ యజమాని అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని విద్యార్థి మృతి చెందితే ధర్నాలు కూడా చేయకుండా అడ్డుకుంటున్నారని అలా చేసిన వారి పైన క్రిమినల్ కేసులు పెడుతున్నారని 

యాజమాన్యాలు ఎవర్ని చంపిన విద్యార్థి సంఘాలు కానీ విలేకరులు కానీ ఆ ప్రాంతానికి వెళ్లకూడదని అలా వెళితే కేసులు పెడతామని పోలీసులు హెస్తరిస్తున్నారని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని ఇలా కేసులు పెట్టడం వల్ల సమస్య రుద్దుతం చేసుకోవడమే తప్ప మరొకటి కాదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి


భీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ విద్యార్థి మృతి పై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఖాజీపేటలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని ఎఫ్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 

           ఖాజీపేట మండల పరిధిలోని భీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ లో 6వ తరగతి చదువుతున్న విద్యార్ధి సొహిత్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం జిల్లా పోలీసు అధికారులపై ఉందన్నారు. విద్యార్థి హాస్టల్ భవనంపైనుండి కిందపడ్డ సీసీ ఫుటేజ్ ని బయట పెట్టిన అనుమానాలు ఉన్నాయని యాజమాన్యమే ప్రతి ఒక్కరిని విచారించాలని వారు డిమాండ్ చేశారు. 


విద్యార్థి మృతి కి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి మృతి కి పాఠశాల యాజమాన్యం నిర్లక్షమే కారణమని వారు తెలిపారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. బంద్ విజయవంతానికి సహకరించిన పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థిని, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యస్ ఎఫ్ ఐ, రాష్ట్ర మాల మహానాడు, సిఐటియు, ఎమ్మార్పీఎస్, మాదిగల విద్యార్థి సంఘం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...